గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 23 నవంబరు 2014 (13:11 IST)

లైసెన్స్ సరెండర్ చేస్తేనే పరిహారం... ప్రభుత్వం ట్విస్ట్... జాలర్ల ఆందోళన

హుదూద్ తుఫాను బాధిత జాలర్లు పడవల లైసెన్స్ లను సరెండర్ చేస్తేనే పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఆక్షలు విధించింది. దీంతో జాలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుదూద్ తుఫాను దాటికి విశాఖ సముద్ర తీరంలోని 30 పడవలు పూర్తిగా నీట మునిగిపోగా, 64 బోట్లు ధ్వంసమయ్యాయి. 450 పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

పడవలను కోల్పోయిన, ధ్వంసమైన జాలర్లకు ప్రభుత్వం రూ. 6 లక్షలు నష్ట పరిహారంగా చెల్లిస్తామని ప్రకటించింది. అయితే లైసెన్స్‌లను సమర్పించాలని ట్విస్ట్ పెట్టింది. దీనికి జాలర్లు వ్యకిరేకిస్తున్నారు. ధ్వంసమైన పడవలను సరిచేయాలంటే రూ. 12 నుంచి 14 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం రూ. 6 లక్షలు ఇస్తే మిగిలిన డబ్బు ఎవరు భరిస్తారని జాలర్లు ప్రశ్నిస్తున్నారు. లైసెన్స్ సమర్పించినట్లైతే తాము సబ్సిడీని కోల్పోతామని అంటున్నారు. 
 
హుదూద్ తుఫాను దాడి చేసి 40 రోజులు అవుతుండగా జాలర్లు అటు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకపోవడం వల్లను, ఇటు పడవలను కోల్పోయి తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటే ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై జాలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బేషరత్‌గా పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.