శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 5 జులై 2015 (15:28 IST)

జగన్‌ పట్టిసీమకు అనుకూలమా? వ్యతిరేకమా? సెక్షన్ 8?: బొజ్జల

పట్టిసీమపై వైకాపా అధినేత జగన్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నట్లు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు. 
 
హైదరాబాదులో బొజ్జల మాట్లాడుతూ, పట్టిసీమపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ గోదావరి జిల్లాల్లో పర్యటించేప్పుడు పట్టిసీమ కారణంగా ఈ జిల్లాలు ఎడారిగా మారుతాయని ఆరోపిస్తారు. అదే రాయలసీమ జిల్లాల్లో పర్యటించేప్పుడు ప్రభుత్వం నీళ్లివ్వడం లేదని విమర్శలు గుప్పిస్తారు. ఇంతకీ జగన్ దేనికి కట్టుబడి ఉంటారు? పట్టిసీమకు అనుకూలమా? వ్యతిరేకమా? అనేది స్పష్టం చేయాలని బొజ్జల అడిగారు.
 
ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మూడు రోజుల జపాన్ పర్యటనకు శనివారం బయల్దేరారు. ఆదివారం మధ్యాహ్నం హాంకాంగ్ చేరుకున్న,  పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా చంద్రబాబు జపాన్ పర్యటనకు వెళ్లారు. ఇకపోతే.. మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడులతో పాటు ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా చంద్రబాబు వెంట వెళ్లారు.