Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేయసితో వాళ్లది అడ్డు చెప్తారనుకున్నాడు... ఫిక్స్ అనేసరికి జంప్ అయ్యాడు...

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (17:35 IST)

Widgets Magazine
wedding

ఉప్పు-కారం, తీపి-చేదు, తప్పు-ఒప్పు వున్నట్లే ప్రేమికుల్లో మంచి ప్రేమికులు, దొంగ ప్రేమికులు అని రెండు రకాలు వుంటారు. మంచి ప్రేమికులు తాము ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయిని కడదాకా కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటారు. కానీ దొంగ ప్రేమికులు వాడుకున్నంత కాలం వాడుకుని వదిలేస్తారు. సుమారుగా అలాంటి సంఘటనే అనుకునేట్లుగా ఓ ప్రేమ వ్యవహారం బయటపడింది. స్నేహితులుగా జర్నీ మొదలుపెట్టిన ఇద్దరు ప్రేమికులయ్యారు. 
 
తమ ప్రేమను పెద్దలక తెలియజేసేటపుడు ఏమయినా అడ్డుపడుతారేమోనని ప్రేమికుడు అనుకున్నాడు కానీ అలాంటిదేమీ లేకుండా అమ్మాయి (ప్రేయసి) తరపు వారు పెళ్లికి ఫిక్స్ అన్నారు. దాంతో పెళ్లికి రంగం సిద్ధమైంది. కానీ పెళ్లి ఘడియలు ముంచుకొచ్చే సమయానికి పెళ్లికొడుకు ఉరఫ్ ప్రేమికుడు జంప్ అయ్యాడు. ఈ ఘ‌ట‌న శ్రీ‌కాకుళం జిల్లాలోని నరసన్నపేటలో గురువారం నాడు చోటుచేసుకుంది. 
 
ఇరువురికీ ఇష్టమైన పెళ్లే కదా బ్రహ్మాండంగా జరిగిపోతుందనుకున్నవారందరికీ వరుడు షాకిచ్చాడు. పెళ్లి కుమారుడిని పిలుచుకురండీ అని పండితుడు పిలిచాక కాని తెలియలేదు అతడు జంపయ్యాడని. కాగా వరుడు ఎందుకలా పారిపోయాడో ఎవ్వరికీ అంతుబట్టలేదు. వధువు రాజ్యలక్ష్మి కూడా అతడు ఎందుకలా చేశాడో తనకి కూడా తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వధువు తరపువారు పోలీసులకు విషయాన్ని ఫిర్యాదు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Bridegroom Escape From Kalyanamandapam In Srikakulam

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమెరికా, రష్యాలనే భయపెట్టే బాంబులు భారత్ వద్ద వున్నాయి... రహస్యంగా...

అణు రహిత బాంబులు తమకే సొంతం అన్నట్లు అమెరికా, రష్యాలు చెపుతుంటాయి. తమవద్ద వున్న బాంబులే ...

news

రెండేళ్ళ ప్రేమ.. మరికొన్ని నిమిషాల్లో ముహుర్తం.. పెళ్లికొడుకు జంప్.. ఎందుకంటే?

వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరుగుతూ ...

news

మృత్యు లారీ 20 మందిని చంపేసింది... ధర్నా శిబిరంలోకి దూసుకెళ్లింది....

చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో శుక్రవారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం ...

news

ప్రధాని మోదీ పిలుపు... బుగ్గ బల్బును తొలగించిన మంత్రి పరిటాల

అమరావతి, వాహనాలపై బుగ్గ బల్బులు తొలగించి, వీవీఐపీ సంస్కృతి చమరగీతం పాడాలన్న ప్రధానమంత్రి ...

Widgets Magazine