గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (11:01 IST)

వ్యభిచారం కేసు.. విటుడిపైనా కేసు నమోదు చేయాలి!: హైకోర్టు

వ్యభిచారం కేసులో పట్టుబడిన మహిళ, వ్యభిచారగృహ నిర్వహకులు, బ్రోకర్ల మాత్రమే కేసు నమోదు చేయడం తగదని, విటుడిపైనా కేసు నమోదు చేసే విధంగా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

ఈ మేరకు చట్టానికి సవరణ చేయాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు తీర్పు కాపీలను పంపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాద్ ఆదేశించారు. 
 
1956 ఇమ్మోరల్ ట్రాఫిక్ (నిరోధక) చట్టం పరిధిలోనికి వ్యభిచార గృహాలకు వెళ్లే విటులు కూడా శిక్షార్హులేనంటూ చట్టానికి సవరణ తేవాలన్నారు. 
 
తనను బంజారాహిల్స్ పోలీసులు ఈ చట్టం సెక్షన్ 3 ప్రకారం ఇమ్మోరల్ ట్రాఫిక్ (నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారని, ఈ కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ ఓ పిటిషనర్ కోర్టులో కేసు వేశారు. 
 
కేసును విచారించిన జడ్జి జస్టిస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వ్యభిచార గృహాన్ని నిర్వహించడం, వ్యభిచారానికి అనుమతించడం, వ్యభిచారంపై వచ్చిన ఆదాయంతో జీవించడం, విటులను ఆకర్షించడం తదితరమైనవన్నీ సెక్షన్ 3,4,5 కింద వస్తాయన్నారు.