Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రంజాన్‌కు ఇంటికొచ్చి.. స్నేహితుడిని రక్షించి... ప్రాణాలు కోల్పోయిన బీటెక్ యువకుడు

గురువారం, 29 జూన్ 2017 (08:55 IST)

Widgets Magazine
deadbody

తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో రంజాన్ పండుగను జరుపుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ బీటెక్ యువకుడు.. సముద్ర స్నానానికెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న తన స్నేహితుడిని కాపాడేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డాడు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... చిలకలూరిపేటలోని గుర్రాల చావిడి పెద్ద మసీదు సమీప ప్రాంతానికి చెందిన సయ్యద్‌ రబ్బానీ (23) నరసరావుపేట ఇంజనీరింగ్‌ కళాశాలలో గత ఏడాది మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
రంజాన్‌ పండగకు హైదరాబాద్‌లోని స్నేహితులతో కలసి చిలకలూరిపేట వచ్చాడు. పండగ తర్వాత రోజైన మంగళవారం స్నేహితులతో కలసి ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు బీచ్‌కు వెళ్లారు. సాయంత్రం స్నేహితులందరూ సముద్రస్నానం చేస్తున్న సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మిత్రుడు అలలో కొట్టుకుపోవడం గమనించిన రబ్బానీ అతడిని రక్షించాడు. ఆపై అలలలో చిక్కుకున్న రబ్బానీ బయటకు రాలేక సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు. పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించినా ప్రయోజనం లేదు. బుధవారం ఉదయం మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫోన్ తీయలేదనీ భార్య తలను గోడకేసికొట్టిన కసాయి భర్త

గుంటూరు జిల్లా సంగడిగుంటలో ఓ దారుణం జరిగింది. ఫోను తీయలేదన్న కోపంతో భార్య తలను ఓ ...

news

అయిదు రూపాయలకే భోజనం. ఇప్పుడు రూ. 1కే లీటర్ మినరల్ వాటర్..

గత సంవత్సర కాలంగా రూ. 5లకే భోజనంతో భాగ్యనగరంలో వేలాది మంది ఆకలి తీరుస్తోన్న గ్రేటర్ ...

news

మొదట మూడు వస్తువులు పంపారు.. తర్వాత మూడు నామాలు పెట్టారు. దేవుడి పేరుతో ఠోకరా

చెయిన్ వ్యాపారం అంటే గొలుసుకట్టు వ్యాపారం అని తెలుసు కదా. మొదట ముగ్గురికి చెప్పండి. ఆ ...

news

వాళ్లను చూసి పోలీసులే వణికిపోయారు.. గేటు బయటి నుంచే పంపించేసారు.. ఏం బతుకురా మీది?

నడమంత్రపు సిరికి అధికారం తోడయినప్పుడు మన సమాజ గర్భం నుంచే పుట్టుకొచ్చిన కుక్కమూతి పిందెలు ...

Widgets Magazine