Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లోకేష్ ఆ అమ్మాయిని అటు తీసుకెళ్లబోయాడు.... దూకేసింది...

సోమవారం, 19 జూన్ 2017 (16:09 IST)

Widgets Magazine

ఈమధ్య కాలంలో అమ్మాయిలపై హింసాత్మక ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరులో మరో ఘటన చోటుచేసుకుంది. బీటెక్ చదవుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థినిని ఓ ఫైనల్ ఇయర్ విద్యార్థి లోకేష్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆమె సాహసం చేయడంతో ముప్పు తప్పింది. 
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు లోని సంగడిగుంట రెడ్లబజారుకు చెందిన విద్యార్థినిని చేబ్రోలులో ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా తను చదివే కాలేజీకి చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థి లోకేష్ బైకుపై ఆమె వద్దకు వచ్చాడు. ఆమెను చూస్తూనే బైకు ఎక్కు అంటూ బెదిరించాడు. అతడి బెదిరింపులకు జడుసుకున్న విద్యార్థిని బైకుపై ఎక్కి కూర్చుంది. 
 
అతడు ఆమెను ఎక్కించుకుని నారాకోడూరు వరకూ వచ్చాడు. అక్కడి సెంటరుకు రాగానే విద్యార్థిని ధైర్యం చేసి అతడి బైకు పైనుంచి కిందికి దూకేసింది. ఆమె అలా దూకేయడాన్ని చూసిన స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లారు. దీంతో లోకేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. విద్యార్థిని తల్లిదండ్రులు అతడిది పెదనందిపాడు అని తెలిసి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అక్కడివారి వీరిని బెదిరించారు. ఐనా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హైదరాబాదులో ఉద్యోగం.. ఇంట్లో పిండివంటలు చేస్తున్నారు.. ఫోన్‌లో మాట్లాడుతూ.. బీటెక్ విద్యార్థిని?

స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ యువత సెల్ఫీలు, పోస్టులు, లైక్లు, షేర్ల కోసం పాకులాడుతున్నారు. ...

news

సరిహద్దుల్లో చేసే యుద్ధం కంటే.. ఏపీలో భూమిని కాపాడుకునేందుకు చేస్తున్న యుద్ధమే కష్టంగా ఉంది!

ప్రభుత్వం కేటాయించిన భూమిని కాపాడుకునేందుకు ఓ మాజీ సైనికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ ...

news

బీజేపీ కురువృద్ధుడి శకం ముగిసినట్టే : రాష్ట్రపతి అభ్యర్థిగా దళితనేత రామ్‌నాథ్ కోవింద్

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీకి మరోమారు శృంగభంగమైంది. ఎన్డీయే కూటమి తరపున ...

news

విచ్చలవిడి మహిళ... ముగ్గురు మొగుళ్లు... ఇద్దరితో అక్రమ సంబంధం...

ఆమె జీవితం విచ్చలవిడిగా మారిపోయింది. గుంటూరుకు చెందిన మహిత అనే మహిళ ముగ్గురు భర్తలను ...

Widgets Magazine