గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: మంగళవారం, 3 మార్చి 2015 (18:12 IST)

బడ్జెట్ బడాయి... లక్ష కోట్లు దాటించిన యనమల

జీతాలిచ్చేందుకు డబ్బుల్లేవంటారు.. రాజధాని సర్వే కూడా నిధులు ఇవ్వలేకపోతున్నామని మాటలు చెబుతారు. కానీ మన ఆంధ్ర ప్రదేశ్ నాయకులు మాత్రం బడ్జెట్ లో బడాయికి పోతున్నారు. బడ్జెట్ ను లక్ష కోట్లను దాటించి గొప్పలకు పోతున్నారు. ఈ నెల 12న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రాజెక్టుపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. 
 
మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలలలో 12 తేదీన రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర పరిది పడిపోయింది. 13 రాష్ట్రాలకే పరిమితమయ్యింది. మరోవైపు నిధుల్లేవని చెబుతున్నారు. కానీ మన మంత్రిగారు మాత్రం ఈ బడ్జెట్ ను లక్ష కోట్ల మైలు రాయిని దాటించనున్నారు. 
 
ఈ బడ్జెట్లోనే పోలవరం, రాజధాని నగరంతో పాటు వివిధ పథకాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలకు నిధులను కలుపుకుని బడ్జెట్ ను లక్ష కోట్ల మైలు రాయిని దాటి పోతోంది.