శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: సోమవారం, 20 ఏప్రియల్ 2015 (10:22 IST)

బుల్లి బాబుకూ బుల్లెట్ ప్రూఫ్ కారు

నారా వారి తాజా వారసుడు బుల్లి బాబు, సీఎం చంద్రబాబు మనవడికి కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు వచ్చేసింది. ఆయనను ఎక్కడకు తీసుకెళ్ళాలన్నా ఆ బుల్లెట్ ప్రూఫు కారులోనే తీసుకెళ్ళతారు.  తాత బాబు వినియోగించిన స్కార్పియో బుల్లెట్‌ఫ్రూఫ్ కారు ఆదివారం నుంచి నారా వారి వారసుడికి అందుబాటులోకి వచ్చింది. 
 
ఉగాది పర్వదినాన బాబు తనయుడు లోకేష్, బ్రాహ్మణి దంపతులకు కుమారుడు పుట్టిన సంగతి విదితమే. నారావారి వారసుడు ప్రస్తుతం తన తాతైన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంట్లో ఉంటున్నాడు. గతంలోనే  నలుగురు కానిస్టేబుళ్లతో భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా బుల్లిబాబుకు బుల్లెట్టు ప్రూఫు కారును ఇచ్చారు.