గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 మే 2017 (10:46 IST)

బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్‌ను గట్టిగా తొక్కేశా.. విశాఖ బస్సు ప్రమాద డ్రైవర్ వాంగ్మూలం

విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ వద్ద శ్రీప్రకాశ్‌ విద్యా సంస్థకు చెందిన పాఠశాల బస్సు ప్రమాదానికి గురికావడం వెనుక అసలు కారణాన్ని బస్సు డ్రైవర్ వెల్లడించాడు. ఈ బస్సు ప్రమాదం డైవర్‌ నిర్లక్ష్యం, పొరపాటే ప్రధ

విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ వద్ద శ్రీప్రకాశ్‌ విద్యా సంస్థకు చెందిన పాఠశాల బస్సు ప్రమాదానికి గురికావడం వెనుక అసలు కారణాన్ని బస్సు డ్రైవర్ వెల్లడించాడు. ఈ బస్సు ప్రమాదం డైవర్‌ నిర్లక్ష్యం, పొరపాటే ప్రధాన కారణమని తేలింది. బస్సు బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్‌ను గట్టిగా తొక్కడంతో బస్సు ఒక్కసారిగా అమిత వేగంతో దూసుకొచ్చిందని బస్సు డ్రైవర్ తెలిపాడు. 
 
సోమవారం డ్రైవర్‌ కృష్ణ షాక్‌లో ఉండటం, చికిత్స పొందుతుండడంతో పోలీసులు ఆయన్ను పూర్తిస్థాయిలో విచారించలేదు. దీంతో మంగళవారం ఆయన కోలుకోవడంతో మహారాణిపేట సి.ఐ. వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు డ్రైవర్‌ను విచారించారు. తాను బస్సును స్టార్ట్‌ చేశానని, అయితే బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్‌ను గట్టిగా తొక్కడంతో క్షణాల్లో బస్సు తీవ్రమైన వేగంతో ముందుకు దూసుకుపోయిందని చెప్పాడు. 
 
రహదారి బాగా వాలుగా ఉండటంతో బ్రేక్‌ వేసేలోపే పెను ప్రమాదం సంభవించిందని పోలీసుల ముందు అంగీకరించారు. అలాగే, ప్రమాద దృశ్యాలు సమీపంలో ఉన్న నిఘా కెమేరాల నుంచి పోలీసులు సేకరించి విశ్లేషించారు. బస్సు అత్యంత వేగంగా జనాలమీదకు దూసుకుపోవడం ఆయా దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడిన విషయం తెల్సిందే.