శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (12:56 IST)

బాబు 100 రోజుల పాలన లాభం లేదు: బీవీ రాఘవులు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వందరోజుల పాలనపై సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పెదవి విరిచారు. బాబు పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
 
రాష్ట్ర రాజధానిని ఎంత అభివృద్ధి చేస్తారో రాయలసీమను కూడా అంతే అభివృద్ధి చేయాలని బీవీ రాఘవులు బాబును డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన, వైఎస్ఆర్ కడప జిల్లా అభివృద్ధిపై ఆదివారం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించిన సెమినార్లో రాఘవులు పాల్గొని ప్రసంగించారు.
 
చంద్రబాబు వందరోజుల పాలనపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు.