శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (09:27 IST)

325వ రోజుకు రాజధాని నిరసనలు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 325వ రోజుకు చేరుకున్నాయి. ఐనవోలు, తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, పెదపరిమి, దొండపాడు, అనంతవరం, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, రాయపూడి, నేలపాడు శిబిరాల్లో ఆందోళనలు కొనసాగాయి.

తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో రైతుల నిరసన దీక్షలు చేపట్టారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతు సంఘ నేతల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. 
అమరావతి రైతులకు భయపడి పోలీసులను అడ్డుపెట్టుకొని సీఎం జగన్‌ సచివాలయానికి వెళ్తున్నారని నేతలు ఎద్దేవా చేశారు. సీఎం సచివాలయానికి వెళ్లే ప్రతిసారీ దీక్షా శిబిరాలను పోలీసులు ఖాళీ చేయించటం అన్యాయం అన్నారు.