శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Modified: శుక్రవారం, 19 డిశెంబరు 2014 (17:14 IST)

13 సంఖ్య బాగోలేదు.. 14 జిల్లాను ఏర్పాటు చేద్దాం...!!

అసలే అగచాట్లలో ఉన్నాం. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి తుపానులు, వర్షాభావ పరిస్థితులు భయపెడుతున్నాయి. ఎందుకాని చూసినా సంఖ్యాశాస్త్రాన్ని నమ్మే వారికి ఓ ఆయుధం దొరికింది. 13 సంఖ్య బాగోలేదని రాష్ట్రాన్ని 14 జిల్లాలు చేయాలనే సలహాను  తమను నమ్మిన నాయకులను పట్టుకుని వారి చెవులు కొరికేశారు. ప్రస్తుతం ఆ 14 జిల్లా రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. ఆ జిల్లా ఏర్పడుతుందో లేదో తెలియదుగానీ అప్పుడే ఊహాగానాలు విహరిస్తున్నాయి. 
 
ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే 14 జిల్లాను ఎక్కడ నుంచి తయారు చేయాలి అనేది ప్రశ్న. అదే రంపచౌడవరాన్ని కేంద్రంగా చేసుకుని తెలంగాణ నుంచి వచ్చే ఏడు మండలాలను కలిపి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలున్నట్లు తెలుస్తోంది. రాజధాని కోసం ఎన్నుకున్న ప్రాంతాలను ఒకగా చేసి 14 జిల్లాను ఏర్పాటు చేస్తారనేది వినిపిస్తోంది. ఇలా కొత్త జిల్లాపై  ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. 
 
ఇంతకీ ఈ ఊహగానాలు ఎందుకు వచ్చాయా అనే ఆలోచిస్తే... రాజధాని చుట్టూ ఉన్న గ్రామాలతో కలపి ఓ మంచి జిల్లాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కామినేని శ్రీనివాస్, చంద్రబాబుల మధ్య వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రంపచౌడవరం కేంద్రంగా ఏర్పడే జిల్లా 14 జిల్లా అవుతుందా లేక రాజధాని ప్రాంతానికి ఎంపికైన మండలాలతో కలసి ఏర్పడే జిల్లా 14 జిల్లా అవుతుందా అనేది సస్పన్సే.