శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2016 (19:08 IST)

సింధూకి తెలంగాణ సీఎం భారీ నజరానా... రూ. 5 కోట్లు, బాబు రూ.3 కోట్లు

ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్‌లో భారతదేశానికి తొలి రజతాన్ని అందించిన పీవీ సింధుకు నగదు బహుమతులు వెల్లువలా వస్తున్నాయి. దేశంలో సింధూకి అత్యధికంగా ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్‌లో భారతదేశానికి తొలి రజతాన్ని అందించిన పీవీ సింధుకు నగదు బహుమతులు వెల్లువలా వస్తున్నాయి. దేశంలో సింధూకి అత్యధికంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. సింధుకు రూ. 5 కోట్లు ప్రోత్సాహకర నగదు బహుమతిని ప్రకటించారు. ఆమెకు హైదరాబాదులో 1000 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఆమెకు తగిన ఉద్యోగం కూడా ఇస్తామని తెలియజేశారు. ప్రపంచ క్రీడారంగంలో మన రాష్ట్రం నుంచి మంచి ఆటగాళ్లను తయారుచేస్తున్న పుల్లెల గోపీచంద్ కు రూ. 1 కోటి ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.3 కోట్లు బహుమతిని ప్రకటించారు. ఆమెకు గ్రూప్ 1 స్థాయి పోస్టుతో సత్కరించాలని కూడా నిర్ణయించారు. ఇంకా సీఆర్డీఎ పరిధిలో ఇంటిస్థలం కేటాయించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కోచ్ పుల్లెల గోపీచంద్ కు రూ. 50 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. సింధూకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ. 2 కోట్లు బహుమతిని ప్రకటించారు.
 
ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సింధూకి రూ.50 లక్షలు నగదు బహుమతి ప్రకటించారు. క్రీడాకారులకు సింధు విజయం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఇకపోతే అరవింద్ కేజ్రీవాల్ సింధూకు రూ. 2 కోట్లు ప్రకటించడంతోపాటు రెజ్లింగులో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్‌కు రూ. 1 కోటి ప్రకటించారు.