శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (12:17 IST)

వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై చీటింగ్ కేసు!

మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. సుబ్బారాయుడు నకిలీ డాక్యుమెంట్లతో 22 చేపల చెరువుల పెంపకానికి.. నరసాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ 5.75 కోట్ల రుణం తీసుకున్నారు.
 
ఈ రుణం తీసుకునేందుకు ఆయన సమర్పించిన డాక్యుమెంట్లన్ని నకిలీవి కావడంతో సీబీఐ అధికారులు ఆయనపై చీటింగ్ కేసు పెట్టారు. సుబ్బారాయుడితో పాటు ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ మరో ఇద్దరిపై కేసు నమోదైంది. 
 
అలాగే సీబీఐ అధికారులు అమలాపురం, భీమవరం, హైదరాబాద్‌లలో తనిఖీలు నిర్వహించారు. గతంలో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన సుబ్బారాయుడు ఆ పార్టీలో ఎంపీగాను, మాజీ మంత్రిగాను పనిచేశారు. తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లి..తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యారు.