Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కర్ణాటక ఎఫెక్ట్ : బీజేపీ నష్టనివారణ చర్యలు.. ఏపీకి సెంట్రల్ వర్శిటీ

బుధవారం, 16 మే 2018 (15:37 IST)

Widgets Magazine

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ మార్క్ వద్ద బోల్తా పడటానికి ప్రధాన కారణం తెలుగు ఓటర్లేనని గణాంకాలతో పాటు.. రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. కాంగ్రెస్ తరహాలోనే బీజేపీ కూడా మోసం చేసిందన్న కోపం తెలుగు ప్రజల్లో ఉంది. ఫలితంగానే కర్ణాటకలోని తెలుగు ప్రజలంతా ఇటు కమలం లేదా అటు హస్తం గుర్తులకు ఓటు వేయకుండా జేడీఎస్ పార్టీకి ఓటు వేశారు.
<a class=bjp flag" class="imgCont" height="450" src="http://media.webdunia.com/_media/te/img/article/2018-05/07/full/1525673663-5907.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
ఫలితంగానే తెలుగు ప్రజలు అధికంగా నివశించే బళ్లారి, బీదర్, రాయ్‌చూర్, కొప్పళ్, కలుబురిగి తదితర ప్రాంతాల్లో బీజేపీ మెజార్టీ సీట్లను దక్కించుకోలేక పోయింది. అంటే తెలుగు ఓటర్లు బీజేపీవైపు మొగ్గుచూపక పోవడంతో ఆ పార్టీకి ఏకంగా 15 నుంచి 25 సీట్ల మేరకు కోల్పోయిందనే వాదనలు వినిపిస్తున్నారు. 
 
దీంతో మేల్కొన్న కమలనాథులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, విభజన హామీలను నెరవేర్చేందుకు చొరవ తీసుకుంటోంది. ఫలితంగా విభజన హామీ మేరకు అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించనుంది. ఇందుకోసం 902 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేయనుంది. 
 
దీనికి సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ సెంట్రల్ వర్శిటీ నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపించిన పక్కా భవనాల్లో తరగతులు నిర్వహించాలని కేంద్ర భావిస్తోంది. ఈ విధంగా విభజన హామీలను నెరవేర్చి ఏపీ ప్రజల ఆదరణ పొందాలని కమలనాథులు భావిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
సెంట్రల్ వర్శిటీ కర్ణాటక ఫలితాలు బీజేపీ తెలుగు ఓటర్లు Anantapur Bjp Central University Telugu Voters అనంతపూర్ Karnataka Verdict

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏపీలో బీజేపీ గెలుపు తథ్యం : హీరో కృష్ణంరాజు జోస్యం

సినీ నటుడు, బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన కృష్ణంరాజు జోస్యం చెప్పారు. వచ్చేయేడాది ఏపీ ...

news

రైతుల కోసం దేశంలోనే మొదటిది అంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్

"సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నది. తెలంగాణ రాష్ట్రం ...

news

గోదావరిలో ఘోరం.. 45మంది గల్లంతు.. కిటికీలు మూతపెట్టడంతో మునిగిపోయిందా?

గోదావరిలో ఘోరం జరిగిపోయింది. గాలివాన దెబ్బకు లాంచీ నీట మునిగింది. దీంతో 30 అడుగుల లోతుకు ...

news

మా ఎమ్మెల్యే ఒక్కొక్కరికి భాజపా రూ.100 కోట్ల ఆఫర్... కుమారస్వామి ఆరోపణ

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఇచ్చేందుకు భాజపా ఆఫర్ చేసిందని ...

Widgets Magazine