Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నారాయణ విద్యా సంస్థలు వర్సెస్ చైతన్య విద్యా సంస్థలు, కలిసి పనిచేయలేం...

శనివారం, 28 అక్టోబరు 2017 (10:52 IST)

Widgets Magazine
narayana

తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ కళాశాలలు కొట్టుకుంటున్నాయా అంటే అవుననే అనాల్సి వస్తోంది. చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ చౌదరి మంత్రి నారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారయణ చైతన్య విద్యా సంస్థలను వేధిస్తున్నారంటూ ఆమె పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఎంతో సహనంతో అన్నీ భరిస్తున్నామనీ, నారాయణ విద్యాసంస్థలతో కలిసి ఇక పని చేయలేమని ఆమె తెలిపారు. ఈ కాలంలో తాము మోసాలను కూడా చూశామన్నారు. నారాయణ విద్యా సంస్థలతో కలిసి పనిచేయడం కష్టమనే తాము ఓ అభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించారు. 
 
కాగా నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయణ మంత్రి కాక మునుపు ఈ రెండు విద్యా సంస్థలు విలీనమైన సంగతి తెలిసిందే. రైండు సంస్థల పేర్లను కలిపి 'చైనా' (చైతన్య, నారాయణ) సంస్థలుగా పిలుచుకోవడం మనకు తెలిసిందే. కాగా ఇటీవలి కాలంలో నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు చేసుకోవడం, తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగడం తెలిసిందే. 
 
తమ విద్యా సంస్థలో వచ్చిన ర్యాంకులను నారాయణ విద్యా సంస్థ సాధించిన ర్యాంకులుగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా... తమ విద్యా సంస్థలో చేరిన ముగ్గురు బాలురను నారాయణ సంస్థలో చేర్పించాలని ఒత్తిడి తెచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సోనియాకి అస్వ‌స్థ‌త.. సిమ్లా నుంచి ఢిల్లీ ఆసుప‌త్రికి త‌ర‌లింపు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అస్వ‌స్థ‌తకు గుర‌య్యారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ...

news

పెళ్లి రద్దుకు కారణమైన కాగడాల పూలజడ

సాధారణంగా చిన్నచిన్న సంఘటనలకు పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఇలాంటి సంఘటనలు అనేకం ...

news

చిన్నమ్మ, మామలు చేసే పాడు పని చూడలేక చనిపోతున్నా...

సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే పెద్దలు మందలిస్తుంటారు. అదే పెద్దలు తప్పు చేస్తే పిల్లలు ...

news

పాక్‌కు అమెరికా వార్నింగ్ : మీరు చేస్తారా? మేం చేయాలా?

ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్‌కు అమెరికా గట్టివార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదుల ...

Widgets Magazine