శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (14:24 IST)

ఇవి బాబు గారి విన్నపాలు.. మోదీగారు ఏమన్నారు...?

విభజన తరువాత రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నష్టపోయిందని తమ రాష్ట్రానికి సాయం చేయాలంటూ బాబుగారు పెద్ద జాబితానే కేంద్ర ప్రభుత్వం ఎదుట పెట్టారు. ఆయన విన్నపాలను సావదానంగా విన్న ప్రధాని మోదీ తన మాటను అరుణ్ జైట్లీ నోట వెల్లడించారు. బాబుగారు దాదాపు రూ. 2.25 లక్షల కోట్లకు లెక్కలు చెబితే మోదీగారు ఏమన్నారంటే అన్నీ తిరుపతి వెంకన్న చెంత ప్రకటిస్తామని చెప్పారట. బాబు ఏమడిగాడు..?
 
ప్రత్యేక హోదాతోపాటుగా... నవ్యాంధ్రకు ఈ ప్యాకేజీపై అమలు చేయాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తొలి ఏడాది ఆర్థిక లోటు భర్తీకే రూ.12,210 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ... దేని అమలుకు ఎంత ఖర్చు అవుతుందో వివరిస్తూ... వీటికోసమే మొత్తం రూ.90,910 కోట్లు అవసరమని చంద్రబాబు లెక్కతేల్చారు. రహదారులకు రూ.27,985 కోట్లు, రైల్వేలకు రూ.21,420 కోట్లు, విమానయానానికి రూ.3100 కోట్లు, పోలవరం ప్రాజెక్టు సహా సాగు, తాగునీటికి రూ.13,714 కోట్లు ఇవ్వాలని కోరారు. 
 
విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా నవ్యాంధ్రకు ఈ హామీ ఇచ్చారని... దీనికి బిహార్‌తో ఇచ్చిన ప్యాకేజీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం నవ్యాంధ్రకు చేయాల్సి సాయంపై చంద్రబాబు చేసిన ప్రతిపాదనలు ఇవే... 
 
ఏ అంశానికి ఎంత కోరారంటే                            - వివరం కావాల్సిన నిధులు
విభజన చట్టంలో ఇచ్చిన హామీలు                    - రూ.90910 కోట్లు
రహదారులు                                              - రూ.27985 కోట్లు
రైల్వేస్‌                                                     - రూ.21420 కోట్లు
విమానాయానం                                         - రూ.3100 కోట్లు
పోర్టులు                                                   - రూ.4800 కోట్లు
విద్యుత్‌                                                   - రూ.3190 కోట్లు
సాగునీరు,వ్యవసాయ అభివృద్ధి                     - రూ.24, 627  కోట్లు
గ్రామీణ త్రాగునీటి సరఫరా                            - రూ.13,714 కోట్లు
పట్టణ సర్వీసులు                                       - రూ.14,106 కోట్లు
అటవీశాఖ                                                - రూ.1,950 కోట్లు
పర్యాటకశాఖ                                            - రూ.4,750 కోట్లు
ఆరోగ్యం                                                   - రూ.5,484 కోట్లు
సామాజిక సాధికారికత                                - రూ.9,450 కోట్లు
మొత్తం ప్యాకేజీ                                          - రూ. 2,25,486 కోట్లు