గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (14:23 IST)

సబ్జెక్ట్స్‌పై పట్టులేదు.. ముగ్గురికి క్లాస్ తీసుకున్న బాబు!

విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతలకు ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ క్లాస్ తీసుకున్నారు. తమకు కేటాయించిన శాఖలకు సంబంధించిన విషయాలపై ఎందుకు అవగాహన పెంచుకోవడం లేదని చంద్రబాబు ఈ ముగ్గురిని ప్రశ్నించారు. ముఖ్యంగా, గంటా శ్రీనివాసరావును ఈ సమావేశంలో చంద్రబాబు కాస్త తీవ్రంగానే మందలించారు. 
 
గురువారం నాడు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేవినేని ఉమను మిగతా మంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. 
 
తెలంగాణతో ఉన్న నీటి పంపిణీ వివాదాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వాదనను బలంగా వినిపిస్తున్న దేవినేని ఉమ లాగా మిగతా మంత్రులు కూడా తమ శాఖకు సంబంధించిన సబ్జెక్స్ పై పట్టు సాధించాలని బాబు ఆదేశించారు. ఇటీవల మంత్రుల పని తీరుపై చంద్రబాబు నిర్వహించిన సీక్రెట్ సర్వేలో కూడా దేవినేని ఉమ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన సంగతి తెలిసిందే.