Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎంతసేపూ నేనే పనిచేసి చావాలా? మీరేం కలెక్టర్లా: మంత్రులపై బాబు మండిపాటు

హైదరాబాద్, బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (03:32 IST)

Widgets Magazine
chandrababu

నవ్యాంద్రప్రదేశ్ అభివృద్ధికోసం రాత్రిపగలూ తానొక్కడినే పనిచేస్తున్నానని మీరేం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులపై మండిపడ్డారు. రాష్ట్ర మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేనొక్కడినే రాత్రిపగలూ పనిచేస్తున్నాను.. మరి మీరు ఏం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇకపై మంత్రులు, అధికారులను పరిగెత్తిస్తానని హెచ్చరించినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, టీడీపీ నేతల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. కొందరు మంత్రులు అధికారుల్లా ఫీలవుతున్నారని, ఒక్కరూ సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అన్నారు. జిల్లాల్లో మంత్రుల పర్యటనలు మొక్కుబడిగా మారాయని, కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.
 
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, తేలిగ్గా తీసుకుంటే కుదరదని చెప్పారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు గట్టిగా పనిచే యాలన్నారు. మరోవైపు మంత్రివర్గ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్‌తో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి పూనం మాలకొండయ్యపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న బీమా పథకం అమలును ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ‘ఈ పథకాన్ని నువ్వు వదిలేశావ్‌..’ అని అచ్చెన్నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానిం చినట్లు తెలిసింది. డెత్‌ సర్టిఫికెట్లు ఇవ్వడం లో జాప్యం, ఇతర కారణాల వల్ల ఈ పథకం అమలులో ఇబ్బందులు వస్తున్నాయని కామినేనిని ఉద్దేశించి చెప్పారు. 
 
రెండు సమావేశాల్లోనూ మంత్రులను టార్గెట్‌ చేసి బాబు మాట్లాడటంతో వారు అవాక్కయినట్లు సమాచారం. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు శివాలెత్తడంపై మంత్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఇలావుండగా సమన్వయ సమావేశంలో మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌.. ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక వార్తలను తిప్పికొట్టాలని మంత్రులు, టీడీపీ నేతలకు సూచించారు. ఏ పత్రికలోనైనా వ్యతిరేక వార్త వస్తే వెంటనే స్పందించి ఎదురుదాడి చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో మట్టిగొట్టుకుపోతాం: అనంత నేతలకు బాబు క్లాసు

మీ పని మీరు చూసుకోకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి తంపులు పెట్టే పనులు చేశారంటే స్థానిక ...

news

నా రాజకీయ గమనం ఇప్పుడే మొదలైంది: సెల్వంతో కలిసి పనిచేస్తానన్న దీప

తన రాజకీయ గమనం ఈరోజే ప్రారంభమైందని, పన్నీర్ సెల్వంతో కలిసి పార్టీ కోసం పని చేస్తానని జయ ...

వేదనిలయం కుట్రల నిలయం అయిందా. జయ అక్కడే దొరికిపోయిందా?

అక్రమార్కులకు కనువిప్పు కలిగిస్తున్న తీర్పు అది. 20 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కూడా ...

news

జాతీయగీతానికి గౌరవమివ్వడం మొక్కుబడి కారాదన్న సుప్రీం

జాతీయగీతానికి గౌరవమివ్వడం మొక్కుబడిలా మారుతున్న నేపథ్యంలో తెరంపై దాన్ని ప్రదర్శించిన ...

Widgets Magazine