గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (16:58 IST)

పవన్ కళ్యాణ్ వల్లనే గెలిచామా? తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం!

పదే పదే పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ గెలిచిందని సొంత పార్టీ నుండి విపక్షాలు కూడా చెబుతుండటం తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదని సమాచారం. టీడీపీ అధికారంలోకి రాగానే పలువురు టీడీపీ, బీజేపీ నేతలు చంద్రబాబుతో పాటు పవన్ ఇంటికి కూడా క్యూ కట్టారు. టీడీపీ గెలుపులో పవన్ పాత్ర ఎంతో ఉందని వారు కొనియాడారు. 
 
ఇప్పుడు అదే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అస్త్రంలా కూడా ఉపయోగపడుతుందంటున్నారు. బాబు తప్పుడు హామీలు, మోడీ, పవన్‌ల హవా వల్లనే టీడీపీ గెలిచిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా నగరి ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేత రోజా మంగళవారం మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ గెలిచిందన్నారు. 
 
ఇలా సొంత పార్టీ, మిత్ర పక్షం బీజేపీ, విపక్షం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా పదే పదే పవన్ పేరును ప్రస్తావించడం రుచించడం తెలుగు తమ్ముళ్లకు రుచించట్లేదని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే, టీడీపీ అధికారంలోకి రావడానికి బాబు పాలనా పటిమ, మోడీ హవా, పవన్ ప్రచారం కలిసి వచ్చిందని, పవన్ ఒక్కడితోనే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రాలేదని మరి కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.