గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (02:14 IST)

తన సమక్షంలోనే నేతల కుమ్ములాట.. బిత్తరపోయిన బాబు.. ఆపై వార్నిగ్

రాయలసీమలో టీడీపీ నేతల కుమ్ములాటలు పరాకాష్టకు చేరుకున్నాయి. జిల్లా తర్వాత జిల్లాలో తన సమక్షంలోనే పార్టీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం, తగాదాలకు దిగటం చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు బిత్తరపోతున్నారు. అసమ్మతి, అనైక్యతపై ఎంత సీరియస్‌గా హెచ్చరిస్తున్నా నేత

రాయలసీమలో టీడీపీ నేతల కుమ్ములాటలు పరాకాష్టకు చేరుకున్నాయి. జిల్లా తర్వాత జిల్లాలో తన సమక్షంలోనే పార్టీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం, తగాదాలకు దిగటం చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు బిత్తరపోతున్నారు. అసమ్మతి, అనైక్యతపై ఎంత సీరియస్‌గా హెచ్చరిస్తున్నా నేతలు పెడచెవిన పెడుతూ యధాప్రకారం తండ్లాటకు దిగటం బాబుకు తలనొప్పి తెప్పిస్తున్నట్లు సమాచారం.. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని, సీట్ల కేటాయింపు కూడా కష్టమేనని చెబుతూ బాబు టీడీపీ నేతలకు వార్నింగ్ ఇస్తూ జిల్లా సమావేశాలను ముగించటం పరిపాటి అవుతోంది.
 
పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, బహిరంగ విమర్శలు చేస్తే క్షమించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. అనంతపురం జిల్లా టీడీపీ నేతలతో శనివారం చంద్రబాబు సమావేశమయ్యారు. కదిరి, రాప్తాడులో పార్టీలో వర్గపోరుపై ఆయన దృష్టి సారించారు. ఎమ్మెల్యే చాంద్ బాషా, కందికుంట వెంకటప్రసాద్‌లు పార్టీ అధినేత చంద్రబాబు ఎదుటే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
 
మంత్రి పరిటాల సునీత, వరదాపురం సూరి విభేదాలపై ఈ సమావేశంలో సెటిల్ మెంట్ చేసినట్లు సమాచారం. ఒకరి నియోజకవర్గంలో మరొక నేత జోక్యాన్ని సహించేది లేదని పార్టీ నేతలను హెచ్చరించారు. తనపై పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలపైనా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.