శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (16:06 IST)

బాబు వ్యాఖ్యలపై జగన్ సవాల్: స్టేట్‌మెంట్ వుంటే రాజీనామా చేస్తా!

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అసెంబ్లీలో మాట్లాడిన మాటలపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. లోక్ సభలో నాడు కాంగ్రెస్ పార్టీపై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిందని, ఎంపీలుగా ఉన్న జగన్, మేకపాటి ఆ నోటీసును వెనక్కి తీసుకున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. ప్రత్యేక హోదా చర్చ సందర్భంగా అసెంబ్లీలో బాబు చేసిన ఆరోపణను జగన్ ఖండించారు. 
 
చంద్రబాబు సభలో మాట్లాడిన మాటలు స్టేట్ మెంట్‌లో లేవన్నారు. ఎక్కడైనా ఉన్నాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేకుంటే బాబే రాజీనామా చేయాలని జగన్ సవాల్ విసిరారు. స్టేట్ మెంట్‌లో ఒకటి ఉంటే చంద్రబాబు ఇంకొకటి మాట్లాడారని చెప్పారు. 
 
అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన నేపథ్యంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ.. సభలో తమకు వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకపోవం దారుణమన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజలను చంద్రబాబు అనుమానంలో పడేశారని ఆరోపించారు. ఇలాంటి సభను తానెక్కడా చూడలేదని మండిపడ్డారు.