Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫైర్ బ్రాండ్ రోజాను టార్గెట్ చేసిన చంద్రబాబు.. నగరి అభివృద్ధికి అడ్డం పడుతున్నారా?

గురువారం, 20 ఏప్రియల్ 2017 (09:28 IST)

Widgets Magazine
rk roja

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యే ఫైర్ బ్రాండ్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో ఓవరాక్షన్ చేయడం, దురుసుగా ప్రవర్తించి.. అధికార  వర్గం కళ్లల్లో పడిన రోజాకు కష్టాలు తప్పట్లేదు. పార్టీలో జగన్ తర్వాత క్రేజున్న నాయకురాలు రోజానే. వైసీపీలో నెం.2 నేతగా పేరు కొట్టేసిన రోజా.. టీడీపీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టడంలో దిట్ట. అయితే రోజాను అధికారిక వర్గం టార్గెట్ చేసినట్లు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. 
 
రోజా క్రేజ్‌ను తగ్గించేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో భాగంగా రోజాను సొంత నియోజక వర్గ ప్రజల్లో చులకన చేసేందుకు ఆ నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా రోజాయే అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరి నియోజకవర్గంపై కక్షపూనారని రోజా విమర్శించారు.
 
ఇందులో భాగంగా జన్మభూమి కమిటీలు, కొందరు అధికారులు కలిసి చివరకు సామాజిక భద్రత పించన్లు కూడా ఇక్కడి అర్హులకు రాకుండా చేస్తున్నారని రోజా విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేగాకుండా ఇక్కడ పనిచేస్తున్న అధికారులను కూడా సొంత నియోజకవర్గం కుప్పంకు తరలించారని రోజా ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం నగరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా వారిని వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నగరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎంతగా పోరాడుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు సహకరించట్లేదని రోజా ఫైర్ అవుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ysrcp Roja Nagari Telugudesam Party Chandrababu Naidu

Loading comments ...

తెలుగు వార్తలు

news

15ఏళ్ల బాలికపై ప్రేమ పేరుతో లైంగిక దాడి.. మరో యువకుడి బ్లాక్ మెయిల్‌, అత్యాచారం..

15ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. తన గదికి తీసుకొచ్చి చాలాసార్లు లైంగికదాడికి ...

news

సరస్వతీ నది ఎండిపోలేదా.. మరి మన కళ్లముందే మహానది మాయమైపోయింది కదా..

మూడు వేల సంవత్సరాల క్రితం పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న సరస్వతి ఉన్నట్లుండి అదృశ్యమై ...

news

పార్టీలో శశికళ వాసనే ఉండకూడదు... మా ధర్మయుద్ధానికి తొలి విజయమిది: మాజీ సీఎ పన్నీర్

అన్నాడీఎంకే నుండి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళతో పాటు.. ఆమె కుటుంబం దూరంకావడం తాము ...

news

సమాధి సాక్షిగా సయోధ్య.. ముఖ్యమంత్రిగా ఓ.పన్నీర్ సెల్వం? మెజార్టీ మంత్రుల సూచన!

అన్నాడీఎంకేలో వైరి వర్గాలు ఏకంకానున్నాయి. అదీ కూడా మెరీనా తీరంలోని దివంగత ముఖ్యమంత్రి ...

Widgets Magazine