బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (20:18 IST)

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బాబు షాక్ ట్రీట్మెంట్.. ఎందుకు?

రాయలసీమ తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపు తొక్కిసలాటలు అధికార పార్టీకి పెద్ద సమస్యగా మారాయి. సీమలో బలంగా ఉన్న వైసిపి దెబ్బతీసేందుకు ప్లాన్ చేసి ఫిరాయింపులు ప్రోత్సహిస్తే చివరకు అది టిడిపీకే చికాకుగా మారింది. కొన్ని చోట్ల ఫిరాయింపు ఎమ్మెల్యేలదే పైచేయి అవు

రాయలసీమ తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపు తొక్కిసలాటలు అధికార పార్టీకి పెద్ద సమస్యగా మారాయి. సీమలో బలంగా ఉన్న వైసిపి దెబ్బతీసేందుకు ప్లాన్ చేసి ఫిరాయింపులు ప్రోత్సహిస్తే చివరకు అది టిడిపీకే చికాకుగా మారింది. కొన్ని చోట్ల ఫిరాయింపు ఎమ్మెల్యేలదే పైచేయి అవుతుండగా మరికొన్ని చోట్ల మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పరాభవం తప్పడం లేదు. అలాంటి వారిలో కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా కూడా చేరిపోయారట.
 
అత్తార్ బాషా పార్టీలో చేరినప్పటి నుంచి కదిరికి తెదేపా ఇన్‌ఛార్జ్ కందికుటం ప్రసాద్ మధ్య వార్ నడుస్తూనే ఉంది. ఆ మధ్య టిడిపి మినీమహానాడు జరిగితే ప్రసాద్, పయ్యావుల కేశవ్ కలిసి అత్తర్‌ను పొద్దు తిరుగుడు పువ్వు అంటూ అవమానించి పంపారట. అయినా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనదేనన్న ధైర్యంతో అత్తార్ బాషా కొనసాగుతున్నారట. కానీ ఇటీవల అనంతపురం జిల్లా వారీగా సమీక్ష నిర్వహించిన చంద్రబాబు గొడవలు వీడి పనిచేయాలని సూచించారు. ఈ సమయంలోనే టిక్కెట్ పైనా చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారని చెబుతున్నారు.
 
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ నీకే దక్కుతుందని అనవసర రాద్దాంతం చేయొద్దని కందికుంట ప్రసాద్‌కు చంద్రబాబు హామీ ఇచ్చేశారట. దీంతో బాషా షాక్ అయ్యారు. ఈ విషయం నియోజవర్గంలోనూ తెలిసిపోవడంతో అత్తార్ వర్గం మరింత దూకుడు పెంచింది. అయితే పార్టీలో చేరే సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని తన అనుచరుల వద్ద ప్రస్తావిస్తూ అత్తార్ బాషా ఆవేదన చెందుతున్నారు.
 
ప్రసాద్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నామని వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే టిక్కెట్ నీకు ఇస్తామని అత్తార్‌కు చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారట. కానీ ఇప్పుడు కందికుంటకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. సమీక్ష సమావేశంలో నేరుగా వచ్చే ఎన్నికల్లో కదిరి టిక్కెట్ కందికుంటకే దక్కుతుందని చంద్రబాబు తేల్చేయడంతో అత్తార్ బాషా దిక్కుతోచని స్థితిలో పడిపోయారట. ఇక తన రాజకీయ జీవితానికి తెరపడినట్టేనన్న ఆందోలన బాషాలో వ్యక్తమవుతోందని ఆయన సన్నిహితులే చెబుతున్నారు.
 
అయితే ఆధిపత్యం చెలాయింపు ఆధారంగానే ఫిరాయింపు ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారన్న అభిమానాన్ని అత్తార్ బాషా వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. అలాంటి ఆధిపత్యం చెలాయించడం రాకపోవడం వల్లే అత్తార్ బాషాను చంద్రబాబు పక్కన పెట్టేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా అనైతికంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరికీ ఇలాంటి షాక్ ట్రీట్‌మెంట్లు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.