శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: మంగళవారం, 28 జూన్ 2016 (20:38 IST)

ముస్లింల‌కు చంద్ర‌బాబు రంజాన్ తోఫా! మ‌సీదులు, ఇమాంల‌కు ఉదారంగా వేత‌నాలు

విజ‌యవాడ‌: ర‌ంజాన్ మాసం సంద‌ర్భంగా ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం సోద‌రుల‌కు తోఫా అందిస్తున్నారు. ప్ర‌భుత్వ ఆదేశాల మేరకు తెల్ల రేషన్ కార్డు కలిగిన ముస్లిం సోదరులకు, రంజాన్ తోఫా సిద్ధం చేశారు. జూలై 1న ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాఫ్తంగా

విజ‌యవాడ‌: ర‌ంజాన్ మాసం సంద‌ర్భంగా ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం సోద‌రుల‌కు తోఫా అందిస్తున్నారు. ప్ర‌భుత్వ ఆదేశాల మేరకు తెల్ల రేషన్ కార్డు కలిగిన ముస్లిం సోదరులకు, రంజాన్ తోఫా సిద్ధం చేశారు. జూలై 1న ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాఫ్తంగా చంద్రన్న రంజాన్ తోఫాను పంపిణీ చేయాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఫోన్ ద్వారా ఆదేశించారు. 
 
వక్ఫ్ బోర్డ్ గుర్తింపు ఉండి, తక్కువ ఆదాయం కలిగిన మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లకు రూ. 5 వేలు, మోజెష్‌లకు రూ.3 వేలు వేతనాన్ని ఇఫ్తార్ విందు రోజున కానీ లేదా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పెద్దఎత్తున మేళా ఏర్పాటు చేసి అందించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మసీదుల మరమ్మతుల కోసం జిల్లాకు రూ 30 లక్షల చొప్పున మంజూరు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మసీదులకు రూ.10 వేలు, మండల కేంద్రాల్లో రూ.15 వేలు, మున్సిపాలిటీల్లో ఉన్న మసీదుల మరమ్మతుల‌కు రూ.20 వేలు మంజూరు చేస్తున్న‌ట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.