గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (12:26 IST)

కళ్లార్పకుండా చంద్రబాబు అబద్దాన్ని చెప్పగలడా...!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఒక గొప్పదనం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తను అడ్డగోలుగా ఒక పనిచేస్తూనే ఎదుటి వాళ్ళను దూషించగలరట. తాను చెప్పేది అబద్ధం అని తెలిసినా ఆయన ఏ మాత్రం ఫీల్‌కారట.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఒక గొప్పదనం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తను అడ్డగోలుగా ఒక పనిచేస్తూనే ఎదుటి వాళ్ళను దూషించగలరట. తాను చెప్పేది అబద్ధం అని తెలిసినా ఆయన ఏ మాత్రం ఫీల్‌కారట. అందుకే గతంలో దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌ రెడ్డి ఒక మాట అంటుండేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బాబూ నువ్వు కళ్ళార్పకుండా అబద్దాలు చెప్పగలవని చెప్పారట. అది ఇంకెవ్వరి వల్ల కాదు అని ఆయన అసెంబ్లీలో ఆయా సందర్భాలలో అనేవారట. కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు తెలుగుదేశంలో చేరారు. స్వయంగా చంద్రబాబే ఆయనకు కండువా కప్పి నీతి వ్యాఖ్యలు చెప్పిన విషయం తెలిసిందే.
 
విశేషం ఏమిటంటే అలా పార్టీ మారిన వ్యక్తి తన పదవికి రాజీనామా చేయకుండా ఫిరాయించడం తప్పు అన్న సంగతి తెలియనట్లు, తెలిసినా తనను ఏ చట్టాలు, ఏ కోర్టులు ఏమీ చేయలేవు అన్న ధైర్యమో ఏమో కానీ చంద్రబాబు మాత్రం ఫిరాయింపుదారులపై పార్టీ కండువాలు కప్పడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని ఏలాలని, అందుకే తాను ఇలా ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నానని ఆయనే స్వయంగా చెబుతున్నారట. 
 
అంటే దానర్థం తనకు సొంతంగా బలం లేదని, ఇతర పార్టీల నేతలను నయానో, భయానో తన పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా అధికారాన్ని అంటకాగాలన్నది ఆయన వ్యూహంగా ఆయనే చెబుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే 20 మంది వైఎస్ఆర్  కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని చట్ట ఉల్లంఘనేకు పాల్పడ్డారు బాబు. ఇలా చంద్రబాబు వ్యవహారశైలి రానురాను విచిత్రంగా మారిపోతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.