బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (11:59 IST)

శ్రీవారి మెట్లు సమీపంలో చిరుత పులుల సంచారం... అధికారులు అలెర్ట్..

తిరుమలకు వెళ్లే నడకదారిలో చిరుత పులులు సంచరిస్తున్న సమాచారం కలకలం రేపింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల కొండపై ఆలయానికి మెట్ల మార్గంలో ప్రతిరోజూ వేలాది సంఖ్యలో భక్తులు నడిచి వెళ్తుంటారు. కొండపైకి వెళ్లే మార్గంలో శ్రీవారిమెట్టు సమీపంలో శుక్రవారం వేకువజామున భక్తులకు చిరుత పులులు కనిపించాయి. దీంతో భయాందోళన చెందిన భక్తులు పరుగులుతీశారు. 
 
అనంతరం కొందరు భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం తెలిపారు. దీంతో అలెర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకుని భక్తులు వద్ద పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చిరుత పులులు సంచారం ఉన్నట్టు సమాచారం రావడంతో కొండ పైకి వెళుతున్న భక్తులను కొంత సేపు నిలిపివేశారు. అనంతరం భక్తులు ఒంటరిగా కాకుండా బృందాలుగా వెళ్లాలని అధికారులు భక్తులకు సూచించారు.