Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైదరాబాదులో చైనా ప్లాస్టిక్ బియ్యం.. అన్నం ముద్దను నేలకేసి కొడితే బంతిలా ఎగిరింది..!

మంగళవారం, 6 జూన్ 2017 (17:27 IST)

Widgets Magazine

హైదరాబాదులో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. ఇప్పుడిప్పుడే దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ కోడిగుడ్లు బయటపడిన నేపథ్యంలో.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యం బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్లాస్టిక్ బియ్యాన్ని వరిబియ్యం అంటూ అమ్మేస్తూ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. హైదరాబాద్, శ్రీశైలం సహా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు అందినట్లు ఆహార భద్రత అధికారులు తెలిపారు. పలుచోట్ల దాడులు చేస్తున్నామని.. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ రైస్ బ‌స్తాల‌ను సీజ్ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వ్యాపారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు వెల్లడించారు. 
 
తాజాగా హైదరాబాద్ మీర్ పేట్‌లో ప్లాస్టిక్ బియ్యం వినియోగంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు అప్రమత్తమై దాడులు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో అశోక్ అనే బాధితుడు ప్లాస్టిక్ బియ్యం వినియోగించినట్లు తెలిపాడు. రెండు నెలల పాటు ఇంట్లో ప్లాస్టిక్ బియ్యాన్నే వాడినట్లు చెప్పాడు. తాము తినే అన్నం ప్లాస్టిక్‌ బియ్యంతో తయారైందని ఆలస్యంగా గుర్తించినట్లు తెలిపాడు. ఈ ప్లాస్టిక్ బియ్యం అన్నం తిన్న తర్వాత ఇంట్లోని అందరికీ కడుపు ఉబ్బిపోతుందని.. ఆసుప‌త్రికి కూడా వెళ్లామ‌ని, ట్యాబ్లెట్లు వేసుకుంటే త‌గ్గుతోంది కానీ, మ‌ళ్లీ అనారోగ్యం ‌పాలు అవుతున్నామ‌ని చెప్పాడు.
 
ఇలా సోమవారం రాత్రి తెచ్చుకున్న బియ్యం కూడా లేటుగా ఉడికింది. అలాగే మెత్తగా ఉండటంతో పాటు అన్నం ముద్ద‌ను నేలకేసి కొడితే అది బంతిలా ఎగిరింద‌ని అశోక్ తెలిపాడు. అందుకే పోలీసులకు ప్లాస్టిక్ బియ్యంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. వ్యాపారులు డబ్బులకు కక్కుర్తి పడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని అశోక్ వాపోయాడు. ఈ బియ్యాన్ని హైదరాబాదులోని నాగోల్ సూపర్ మార్కెట్ అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆరేళ్ల చిన్నారిపై 50ఏళ్ల మహిళ బెత్తం దాడి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ (Video)

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆహారం తీసుకుంటుండగా కింద రాల్చిందనే కారణంతో ...

news

ఓమలూరులో నిర్భయ తరహా ఘటన.. తల్లిదండ్రులపై అలిగింది.. గ్యాంగ్‌రేప్‌కు గురైంది..

నిర్భయ తరహా ఘటన ఓమలూరులో చోటుచేసుకుంది. 15 ఏళ్ల చిన్నారిని బస్సులోనే ముగ్గురు డ్రైవర్లు ...

news

అక్రమ సంబంధం... భార్యను ముక్కలు ముక్కలుగా చేసి... ఆ తరువాత?(Video)

అక్రమ సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ...

news

అత్తా ఆశీర్వదించు.. రంగంలోకి దిగుతున్నా... దినకరన్, నేను కూడా వచ్చాక చక్రం... శశి

తమిళ రాజకీయాల్లో గత కొన్నిరోజుల ముందు వరకు రజినీకాంత్ వ్యవహారమే హాట్ టాపిక్ ఉంది. అయితే ...

Widgets Magazine