మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (21:32 IST)

బాపు మృతి : చిరంజీవి - చంద్రబాబు - కేసీఆర్ - రామానాయుడు సంతాపం...

ప్రముఖ దర్శకుడు బాపు మరిలేరన్న వార్త తెలిసిన తర్వాత టాలీవుడ్ హీరో చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయనలేని లోటు తీర్చలేనిదన్నారు. బాపు మృతికి సంతాపం తెలిపారు. సోమవారం చెన్నై వెళ్ళి నివాళులు అర్పించనున్నట్టు తెలిపారు. ఓ మహనీయుణ్ణి కోల్పోయామని, చలన చిత్ర పరిశ్రమ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని చిరంజీవి అన్నారు. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ దర్శకుడు బాపు అని కొనియాడారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు, సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన మరణంతో ఒక ధ్రువతార నేలరాలిందని వ్యాఖ్యానించారు. బాపు రేఖా చిత్రాలు... తెలుగు ప్రజల జీవితానికి ప్రతీకలని అభివర్ణించారు. 
 
బాపు గుండెపోటుతో మరణించడం పట్ల ప్రముఖ నిర్మాత రామానాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాపుతో తనకు కొద్దిపాటి పరిచయం మాత్రమే ఉందని, అయితే, ఆయనెంతో మర్యాదస్తుడని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి మరొకరు లేరని, ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తని అభిప్రాయపడ్డారు. తమ బ్యానర్లో సినిమా తీయాలని బాపును అడిగానని రామానాయుడు గుర్తు చేసుకున్నారు. బాపు మృతిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విచారం వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. 
 
అదేవిధంగా టాలీవుడ్ అగ్ర నిర్మాత డాక్టర్ డి రామానాయుడు స్పందిస్తూ.... బాపు మరణ వార్త జీర్ణించుకోలేనిదన్నారు. బాపుతో తనకు కొద్దిపాటి పరిచయం మాత్రమే ఉందని, అయితే, ఆయనెంతో మర్యాదస్తుడని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి మరొకరు లేరని, ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తని అభిప్రాయపడ్డారు. తమ బ్యానర్లో సినిమా తీయాలని బాపును అడిగానని రామానాయుడు గుర్తు చేసుకున్నారు.