శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (16:54 IST)

చంద్రబాబుపై చిరంజీవి విమర్శలు.. హుదూద్‌లో కూడా వ్యక్తిగత ప్రచారమేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గురువారం తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఓ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ.. హుదూద్ తుఫాను సమయంలోనూ చంద్రబాబు ప్రచారం కోసం వెంపర్లాడారని ఎద్దేవా చేశారు. 
 
తుఫాను బాధితులను ఆదుకోవడంలో బాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తుఫాను వస్తుందన్న సూచనలను సర్కారు పట్టించుకోలేదని, అందుకే ప్రాణనష్టం జరిగిందని అన్నారు. 
 
పంటపొలాల్లో రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. భూసేకరణ అంశంలో రైతులను ఒప్పించాలే తప్ప, బలవంతం చేయరాదని అన్నారు. రైతులతో సున్నితంగా వ్యవహరించాలని చిరంజీవి హితవు పలికారు. 
 
నల్లధనం వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెదిరింపు ధోరణితో నడుచుకుంటోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నల్లధనాన్ని స్వదేశానికి తెస్తామని ప్రకటించిన బీజేపీ.. 150 రోజులు గడుస్తున్నా ఆ పని చేయలని మండిపడ్డారు. పైగా, వందలాది మంది పేర్లు ఉంటే కేవలం మూడు పేర్లు మాత్రమే బీజేపీ బయటపెట్టిందని విమర్శించారు.