శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2014 (20:07 IST)

హుదూద్‌ సహాయక చర్యల్లో ఏపీ సర్కారు విఫలం: చిరంజీవి ఫైర్

హుదూద్ తుపాను సహాయక చర్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావే ఏపీ సీఎం చంద్రబాబును మెచ్చుకున్న నేపథ్యంలో.. హుదూద్ తుపాను సహాయక చర్యల్లో ఏపీ సర్కార్ విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఆరోపించారు. 
 
హుదూద్ తుపాను వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని చిరంజీవి మండిపడ్డారు. తుపాను సహాయంపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.
 
సహాయక చర్యలకు సంబంధించి తాము నిర్ణయాత్మక సూచనలు ఇస్తుంటే... వాటిని విమర్శలుగా భావిస్తున్నారని విమర్శించారు. భాధితులకు వీలైనంత మేలు జరగాలన్నదే తమ తాపత్రయమని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే.. హుదూద్ తుపాను విలయానికి మృతి చెందిన వారి సంఖ్య 40కి చేరుకుంది. విశాఖ జిల్లాలో 27 మంది, విజయనగరం జిల్లాలో 12 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృత్యువాత పడినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.