Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలుగుదేశం పార్టీని చిరంజీవి టార్గెట్ చేశారు... ఎలా...?

శనివారం, 14 జనవరి 2017 (13:04 IST)

Widgets Magazine
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి. పదేళ్ళ పాటు రాజకీయాల్లో ఉండి చివరకు తాను కింగ్‌గా ఉన్న సినీపరిశ్రమలోకి వెళ్ళిపోయారు. అంటే రాజకీయాలకు సన్యాసం తీసుకున్నారని కాదు. ప్రస్తుత పరిస్థితులలో రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదన్నది ఆయన అభిప్రాయం. అందుకే చాలారోజులు కసరత్తు చేసి మరీ "ఖైదీ నెంబర్‌ 150"వ సినిమాను తీశారు. ఇదంతా బాగానే ఉన్నా సినిమాలో అధికార పార్టీ తెలుగుదేశంను చిరంజీవి టార్గెట్‌ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
 
రైతుల సమస్యలపై పోరాడే ఒక రియల్‌ హీరోగా 'చిరంజీవి ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో నటించారు. ఎక్కువగా సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో వైలెంట్‌ కూడా ఎక్కువే. ఎప్పుడంటే అప్పుడు ఫైట్లు.. మొత్తం మాస్‌ ప్రేక్షకులను బాగానే అలరించిందన్న టాక్‌ ఉంది కానీ చిరు డైలాగ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అదే రైతు రుణమాఫీ.
 
రైతుల భూములపై పోరాడే చిరంజీవి చివర్లో క్లైమాక్స్ వచ్చే సమయానికి మీడియాతో మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం ఆదుకుంటోందని జర్నలిస్టు ప్రశ్నిస్తే ఎక్కడ రుణమాఫీ అంటూ భారీ డైలాగ్‌ వదులుతారు. ఈ డైలాగ్‌ విన్న టిడిపి నాయకులందరికీ అరటిపండు వొలచి నోట్లు పెట్టినట్లుగా అంతా బాగానే అర్థమైపోయింది. సినిమాల్లో తెలుగుదేశం పార్టీని చిరు టార్గెట్‌ చేశారన్నది స్పష్టంగా తెలుస్తోంది. అసలు సినిమా ఘూటింగ్‌ సమయంలోనే తెలుగుదేశం పార్టీలో చిరంజీవి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు ఏకంగా నారాలోకేష్‌ రంగంలోకి దిగి చిరంజీవితో సంప్రదింపులు జరిపినట్లు వార్తలొచ్చాయి.
 
అయితే ఉన్నట్లుండి చిరంజీవి సైలెంట్‌ అయిపోవడం.. తాను తీసిన సినిమాలో చిరు డైలాగ్‌లు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటట్లుగా ఉండటం చూస్తుంటే అధికార పార్టీ నాయకులకు ఏమీ అర్థంకాని పరిస్థితిలా మారింది. చిరంజీవి డైలాగ్‌లో రైతు రుణమాఫీ ఎక్కడ అన్న విషయం స్పష్టంగా ఉండడంతో తెదేపా నేతలు దీనిపై రైతులకు ఏం చెప్పాలో తెలియక ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నారు. కారణం తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీని అమలు చేయకపోవడమే....!Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మంత్రి ఇలాకాలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు... చంద్రబాబుకు తలనొప్పి!

సాక్షాత్తు మంత్రి ఇలాకాలోనే అధికారపార్టీలలో ఆధిపత్య పోరు జరుగుతోంది. అది కూడా ఎక్కడో కాదు ...

news

మద్యం సేవంచే రాజకీయ నేతలను ఉరితీయాలి : సెనేటర్ షాహీ సయ్యద్

పాకిస్థాన్ దేశంలోని అవామీ నేషనల్ పార్టీకి చెందిన షాహీ సయ్యద్ అనే సెనేటర్ ఓ సంచలన ప్రకటన ...

news

బెంగుళూరులో 'నిర్భయ' ఘటన.. 'లవ్‌ లెటర్‌ ఇస్తే చిల్లర ఇస్తా'నన్న కండక్టర్... డ్రైవర్ వత్తాసు

దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో మరో నిర్భయను తలపించే భయానక చర్య ఒకటి జరిగింది. డిసెంబర్ 31వ ...

news

మహిళలకు కథలు చెప్పి లోబరుచుకుని అత్యాచారం... కర్చీఫ్‌తో గొంతు బింగించి హత్య... తూగోలో కిరాతక చర్య

తూర్పుగోదావరి జిల్లాలో ఓ కిరాతకుడు చేసిన చేసిన దుశ్చర్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ ...

Widgets Magazine