Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వివాహేతర సంబంధం... మరొకరితో లింక్ పెట్టుకుందని టీచర్ గొంతుకోసిన మరో టీచర్(video)

గురువారం, 20 ఏప్రియల్ 2017 (19:36 IST)

Widgets Magazine
premakumari

మహిళలపై దారుణాలు ఆగడంలేదు. చిత్తూరు జిల్లాలో గురువారం దారుణం ఘటన జరిగింది. గంగవరం మండలం మబ్బువారి పేట ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ప్రేమ కుమారిని సహోపాధ్యాయుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఉపాధ్యాయురాలు క్లాసులో విద్యార్థులకు పాఠాలు చెపుతున్న సమయంలోనే చంద్రమౌళి అనే మరో టీచర్ ఆమె గొంతుకోసి అతి కిరాతకంగా హత్యచేశాడు. 
 
భర్త పోయాడన్న బాధతో వున్న ఆమెను చంద్రమౌళి చేరదీసి లోబరుచుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్నినెలలుగా వీరి మధ్య ఈ సంబంధం కొనసాగుతోంది. అయితే గత కొన్నిరోజులుగా ప్రేమకుమారిపై అనుమానం పెట్టుకున్నాడు చంద్రమౌళి. ఆమె మరెవరితోనే కలుస్తోందన్న అనుమానం మొదలైంది. దీంతో ఆగ్రహాన్ని తట్టుకోలేకపోయిన చంద్రమౌళి, పాఠశాలలో పిల్లలకు క్లాస్ చెబుతుండగా ప్రేమకుమారిపై కత్తితో దాడికి దిగాడు. ఆమె శరీరంపై కత్తితో విచక్షణారహితంగా నరికాడు. 
 
రక్తపుమడుగులో ఉన్న ప్రేమకుమారిని పాఠశాల యాజమాన్యం వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా నిందితుడు చంద్రమౌళి పరారయ్యాడు. ఇతడి కోసం గాలిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రియురాలి కోసం విమానం హైజాక్... హైదరాబాద్ యువకుడు....

పిచ్చి ప్రియులు అని ఇలాంటివారినే అంటుంటారు. తాము అనుకున్నది జరుగకపోతే పిచ్చిపిచ్చి ...

news

గ్రామవేదికపై అమ్మాయిలకు ముద్దులుపెడుతూ.. నృత్యం చేస్తూ అధికారుల మజా...

వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, సమస్యల పరిష్కారం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ అన్ని ...

news

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు తగ్గిపోతున్నారో తెలుసా?

అమ్మా స్కూల్‌కు వెళతా.. ఉండు నాన్నా మంచి ర్యాంక్ సాధించిన ప్రైవేటు స్కూల్లో నిన్ను ...

news

భర్త టెక్కీ... భార్య ఎంబీఏ.. వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్... "విడాకులిస్తున్నా.. మరో మంచి మొగుడు దొరకాలని"..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ వ్యవహారంపై చర్చ సాగుతోంది. ఈ విధానం వల్ల ముస్లిం ...

Widgets Magazine