Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిత్తూరుకు ఎమ్మెల్యే ఉన్నారా? సూటిపోటి మాటలతో చిన్నబోయారా?

బుధవారం, 11 జనవరి 2017 (11:25 IST)

Widgets Magazine
sathya prabha

చిత్తూరు ఎమ్మెల్యే డి.ఎ.సత్యప్రభ. ఈ పేరు గురించి పెద్దగా ప్రస్తావించనక్కరలేదు. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న డి.కె.ఆదికేశవుల నాయుడు సతీమణి ఆమె. ఆయన మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన సత్యప్రభ చిత్తూరులో శాసనసభ స్థానానికి గెలుపొందారు. మొదట్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న సత్యప్రభ ఆ తర్వాత దూరమైపోయారు. ఒక కారణం అనారోగ్యమైతే మరో కారణం కొంతమంది సీనియర్‌ నేతల సూటిపోటి మాటలే. దీంతో ఆమె అసలు రాజకీయాల్లో ఉండాలా.. వద్దా అనే ఆలోచనలో పడ్డారంట. పూర్తిగా రాజకీయ సన్యాసానికే సిద్ధమయ్యారని సత్యప్రభ సన్నిహితులే చెబుతున్నారు.
 
కింగ్‌ ఫిషర్‌ సంస్థ.. ఈ సంస్థ పేరు వింటే మొదటగా గుర్తుకువచ్చేది విజయమాల్యా. రెండవది ఆదికేశవుల నాయుడు. చిత్తూరుకు చెందిన ఈయన ఎంపీగా కాదు తితిదే పాలకమండలి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. అయితే పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ముందు నుంచీ అందరితోను సన్నిహితంగా ఉంటూ రావడమే కాకుండా పలువురికి సేవ చేయడం ఆదికేశవులనాయుడుకు అలవాటు. ఆయన మంచితనమే సత్యప్రభకు బాగా కలిసొచ్చిందని అందరూ అనుకుంటుంటారు. 
 
మొదట్లో అందరూ భావించినట్లు సత్యప్రభను అందరు నాయకులు బాగానే మాట్లాడినా ఆ తర్వాత ఆమెపై కక్ష్యపెంచుకోవడం ప్రారంభించారు. కారణం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ప్రజలకు చేరువకావడమే కాకుండా అధినేతకు దగ్గరగా ఉంటుందన్న కోపమే. ఆ కోపం కాస్త సీనియర్‌ నేతలు మింగుడు పడనీయకుండా చేసింది. దీంతో ఆమెతో మాట్లాడడమే చాలామంది మానేశారు.
 
సీనియర్ల అలకతో పాటు చివరకు ఆరోగ్యమూ క్షీణించడంతో సత్యప్రభ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. మెల్లమెల్లగా పార్టీకే దూరమవ్వడం ప్రారంభించారు. చిత్తూరులో గత కొన్నినెలలుగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా ఆమె మాత్రం ఎక్కడా పాల్గొనడం లేదు. ప్రజాప్రతినిధిగా మొదటగా సత్యప్రభ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా సత్యప్రభ పాల్గొనడం లేదు. 
 
పార్టీకి దూరమవ్వడమే కాకుండా రాజకీయ సన్యాసం తీసుకుని తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సత్యప్రభ ఆలోచనలో ఉన్నట్లు ఆమె సన్నిహితులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద చిత్తూరు రాజకీయాల్లో చక్రం తిప్పిన ఒక కుటుంబం రాజకీయ సన్యాసం తీసుకుంటుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఈ రోజు రాత్రి 12.30 నుంచి 3.30దాకా సెల్‌ఫోన్‌ను తల దగ్గర పెట్టుకోకూడదా?

అంగారక గ్రహం విశ్వకిరణాలను ప్రసరించే అవకాశం ఉందని.. అందుచేత ఈ రోజు (బుధవారం) రాత్రి 12.30 ...

news

బోరున విలపిస్తూ ప్రసంగించిన బరాక్ ఒబామా.. అధ్యక్ష పదవికి వీడ్కోలు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బోరున విలపించారు. ఆయన శ్వేతసౌథాధ్యక్షుడిగా చివరి ప్రసంగం ...

news

ఢిల్లీలో దారుణం : చెత్త ఏరుకునే బాలికపై గ్యాంగ్ రేప్... ఆ తర్వాత...

దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాల కేంద్రంగా మారిపోతోంది. ఇక్కడ మహిళల మానప్రాణాలకు ఏమాత్రం ...

news

తమిళనాడులో 84 ఏనుగులు చనిపోయాయ్.. మగ ఏనుగులే అధికం: కాళిదాస్

ఏనుగుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర కొండ ప్రాంతాల భద్రత కమిటీ ...

Widgets Magazine