బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Modified: సోమవారం, 20 జూన్ 2016 (22:10 IST)

చిత్తూరు కోర్టులో బాంబు పెట్టింది మేమే.. ఆల్‌ఖైదా పేరుతో లేఖ

చిత్తూరు కోర్టులో బాంబు పేల్చింది మేమేనంటూ ఆల్‌ఖైదా పేరుతో ఒక లేఖ కోర్టుకు వచ్చింది. లేఖపై ది డేస్‌ మూవ్‌మెంట్‌ అంటూ ఉంది. లేఖను తీసుకున్న కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్నిరోజులకు ముందు కోర్టులోని వాహనాల పార్కింగ్‌ ఆవరణలో బాంబు ప

చిత్తూరు కోర్టులో బాంబు పేల్చింది మేమేనంటూ ఆల్‌ఖైదా పేరుతో ఒక లేఖ కోర్టుకు వచ్చింది. లేఖపై ది డేస్‌ మూవ్‌మెంట్‌ అంటూ ఉంది. లేఖను తీసుకున్న కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్నిరోజులకు ముందు కోర్టులోని వాహనాల పార్కింగ్‌ ఆవరణలో బాంబు పేలిన విషయం తెలిసిందే.
 
బాంబు పేలిన సంఘటనలో కోర్టులో విధులు నిర్వహించే ఒక అటెండర్‌ కాలికి గాయాలయ్యాయి. అయితే ప్రాణనష్టం ఏమీ జరుగలేదు. పాతకక్ష్యలతో చింటూను చంపేందుకే ప్రత్యర్థులు బాంబు పెట్టారని ముందుగా అందరూ భావించారు. అయితే ఒక లేఖ ఆల్‌ఖైదా పేరుతో రావడంతో పోలీసులు ఆలోచనలో పడ్డారు. 
 
లేఖపై ఎలాంటి చిరునామా లేకపోవడంతో ఆకతాయిలు ఎవరైనా రాసి ఉంటారా..లేకుంటే నిజంగానే ఉగ్రవాదులు రాశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిత్తూరు కోర్టును పేల్చాల్సినంత అవసరం ఉగ్రవాదులకు లేదని, ఇది మొత్తం పాతకక్ష్యల వల్లేనని పోలీసులు భావిస్తున్నారు.