మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: సోమవారం, 30 మార్చి 2015 (06:20 IST)

విశాఖ జిల్లాలో పేలుడు... ఏడుగురు మృతి.. కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం

విశాఖ జిల్లాలోని ఎస్. రాయవరం మండలం గోకులపాడులోని బాణాసంచా గోడౌన్లో ఆదివారం సాయంత్రం సంభవించిన పేలుడు ఘటనలో ఏడుగురు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ను ఆదేశించిన సీఎం పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో 16నుంచి 18మంది వరకు కూలీలు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. బాణాసంచా పేలుడు ఘటనలో బాధితులంతా కూలీలేనని తెలుస్తోంది. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్, నక్కపల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 
 
జాగ్రత్తలు చేపట్టకుండా మందుగుండును నిలువ ఉంచడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గౌడన్ యజమానిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.