ట్రాక్టర్ నడిపిన ఏపీ ముఖ్యమంత్రి జగన్
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం ట్రాక్టర్ నడిపారు. ఈ ఆసక్తికర దృశ్యం గుంటూరు జిల్లా చుట్టగుంట ప్రాంతంలో కనిపించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ఆర్ యంత్ర సేవ పథకాన్ని రైతుల కోసం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్రాక్టర్ నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ సందర్భంగా రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాలను ఆయన జెండా ఊపి పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఆయన ఒక రైతు గ్రూపుతో కలిసి స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఆ సమయంలో ఏపీ వ్యవసాయ కమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదిలావుంటే, రాష్ట్ర వ్యాప్తంగా 3800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాలను పంపిణీ చేశారు. అలాగే, 5262 రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సీడీని సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.