శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By IVR
Last Modified: గురువారం, 24 జులై 2014 (17:42 IST)

నవభారత్ ఆస్తులు ఈడీ ఎటాచ్.. మటాష్ మటాష్!

హైదరాబాద్‌కి చెందిన సంస్థ నవభారత్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌ బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దానికి చెందిన 186 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరొక్టరేట్ ఈడీ జప్తు (అటాచ్) చేసింది. బొగ్గు బ్లాకుల కోసం 2006 నుంచి 2009 మధ్య చేసిన దరఖాస్తుల్లో నవభారత్ సంస్థ వాస్తవాలను దాచిపెట్టిందని సీబీఐ ఇప్పటికే ఈ కంపెనీ పేరును చార్జిషీట్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. 
 
బొగ్గు స్కామ్ దర్యాప్తులో భాగంగా జూలైలో తొలిసారిగా నాగ్‌పూర్ కంపెనీకి చెందిన రూ.24.50 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఆస్తులను జప్తు చేయడానికి ముందు నవభారత్ సంస్థ, దాని డైరెక్టర్లు జరిపిన ఆర్థిక లావాదేవీలను పరిశోధించి, నమోదు చేసినట్లు ఇడి తెలిపింది. బొగ్గు క్షేత్రాలను చట్టవిరుద్ధంగా పొందేందుకు నేరానికి పాల్పడినందుకు ఆ కంపెనీ షేర్లు, భూ ఆస్తులను జప్తు చేసుకున్నట్లు ఇడి తెలిపింది.