గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (11:07 IST)

24 గంటల్లో కోస్తా, తెలంగాణల్లో భారీ వర్షాలు!

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణల్లో భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది.
 
ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడ్డాయి.