Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్టేషన్ లాకప్‌లో కోడి పుంజులు.. తిండి పెట్టలేక పోలీసుల అవస్థలు!

గురువారం, 25 జనవరి 2018 (10:45 IST)

Widgets Magazine
cocks

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా కోడి పందేలు జరిగాయి. నిజానికి ఓ కోడి పందేల నిర్వహణపై అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి. కానీ వీటన్నింటినీ తుంగలో తొక్కి కోడి పందేల నిర్వహణ యధేచ్చగా సాగింది. 
 
అయితే, ఈ కోడి పందేల కోసం పెంచిన కోడి పుంజులకు పందేలకు ముందు మహారాజుల్లాగా బతికాయి. ఉదయాన్నే జీడిపప్పు, బాదంపప్పు నుంచి చికెన్, మటన్ వరకూ లాగించినవే. కానీ ఇప్పుడు లాకప్‌లో అన్నమో రామచంద్రా అంటూ గగ్గోలు పెడుతున్నాయి. ఈ కోడి పుంజులకు తిండి పెట్టలేక పోలీసులు నానా తంటాలూ పడుతున్నారు. దీనికంతటికీ గల కారణాలను పరిశీలిస్తే, 
 
సంక్రాంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు వేస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి 9 పుంజులను, ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న కోడిపుంజులను తీసుకెళ్లి న్యాయమూర్తి సమక్షంలో హాజరుపరిచారు. అయితే, నిందితులందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి విడుదల చేశారు. ఈ పుంజులతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ అదుపులోకి తీసుకున్న కోడిపుంజులన్నింటినీ ఒకేసారి ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించడంతో వాటిని మళ్లీ వెనక్కు తీసుకువచ్చి, ఏం చేయాలో తెలియక, లాకప్‌లో ఉంచారు. ఇప్పుడు అచ్యుతాపురం స్టేషన్ లాకప్ నేరాలకు పాల్పడిన వాళ్లకు బదులుగా కోళ్లతో నిండిపోతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Vizag Cock Fight Sankranthi Festival Police Station Lockup

Loading comments ...

తెలుగు వార్తలు

news

''పద్మావత్''పై నిరసన: స్కూలు బస్సుపై దాడి.. చిన్నారులు భయంతో? (వీడియో)

బాలీవుడ్ సినిమా పద్మావత్ సినిమా ఎన్నో వివాదాల నడుమ గురువారం విడుదల సిద్ధమైంది. అయితే ఈ ...

news

పవన్‌కు నాపై లవ్వెక్కువ : కాంగ్రెస్ నేత వీహెచ్

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీహెచ్ పేరును ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో ...

news

ఆ దృశ్యాలన్నీ మార్ఫింగ్... నిర్దోషిగా బయటకొస్తా : గజల్ శ్రీనివాస్

తాను ఏ తప్పూ చేయలేదనీ, ఏ ఒక్క అమ్మాయిని లైంగికంగా వేధించలేదనీ ప్రముఖ గజల్ గాయకుడు గజల్ ...

news

నల్గొండ జిల్లా మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్తను చంపేశారు...

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త ...

Widgets Magazine