శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (18:39 IST)

తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీదేవి : ఆనవాయితీకి తిలోదకాలు!

తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీదేవి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆది నుంచి వస్తున్న ఆనవాయితీని ఆ పార్టీ నేతలు తిలోదకాలిచ్చారు. 
 
సాధారణంగా ఎవరైనా సిట్టింగ్ ప్రజాప్రతినిధి చనిపోయినప్పుడు, ఆ తర్వాత జరిగే ఉపఎన్నికలో మిగతా పార్టీలు అభ్యర్థిని నిలపకపోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా వ్యవహరించింది. తమ అభ్యర్థిని బరిలో దింపింది. 
 
కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత చింతా మోహన్ మాట్లాడుతూ.. అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే సుగుణమ్మ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వెంకటరమణ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారని అన్నారు. 
 
కాగా, తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. టీడీపీ వెంకటరమణ సతీమణి సుగుణమ్మను బరిలో నిలుపగా, వైకాపా పోటీకి దూరంగా ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని బరిలోకి దించింది.