Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మతపెద్ద ముసుగులో మోసాలు.. 1000 పెళ్లిళ్లు.. అందమైన అమ్మాయిల్ని షేక్‌లకు?

గురువారం, 28 సెప్టెంబరు 2017 (09:45 IST)

Widgets Magazine
muslim women divorce

దాదాపు వెయ్యి పెళ్లిళ్లు చేసిన పాతబస్తీలో గ్రేటర్‌ చీఫ్‌ ఖాజీ రఫియా లీలలు వెలుగులోకి వచ్చాయి. మతపెద్ద ముసుగులో మోసాలు చేశాడు. డబ్బు కోసం రికార్డు స్థాయిలో 1000 కాంట్రాక్టు మ్యారేజీలు చేశాడు. అరబ్బు షేకులెవరికైన కొత్త పెళ్లాం కావాలనిపిస్తే ఖాజీ రఫియాను సంప్రదిస్తారు.

అంతేవారు హైదరాబాదు ఎయిర్ పోర్టులో దిగింది మొదలు అన్నీ రఫియానే చక్కబెడతాడు. ఇందుకు తన ఏజెంట్లను నియమించుకున్నాడు. వారి పనేంటంటే... ముస్లిం బస్తీల్లో అందంగా ఉండే ముస్లిం యువతుల అడ్రస్ లు సంపాదించి, వారి తల్లిదండ్రులను ముగ్గులోకి లాగడమే. 
 
ఇలా పేద ముస్లింలను టార్గెట్ చేసేందుకు ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. ఇలా అందాల ఆశ చూపించి.. రూ.70వేలు చేతిలో పెట్టి  రూ.2,50,000లను ఏజెంట్లు తీసుకుంటారు. పెళ్లికి ఐదులక్షలు సుపారీ ఇస్తారు. ఇలా పేదరికాన్ని ఆసరాగా తీసుకుని వారిని వంచిస్తాడు. పెళ్లి కంటూ వచ్చే అరబ్ షేక్‌లు హైదరాబాదు వచ్చారంటే.. రోజుకి ఐదువేల రూపాయల అద్దెతో పాటు పెళ్లికి 5,00,000 రూపాయలు చెల్లించాల్సిందే. మిగతా కార్యక్రమాలన్నీ ఖాజీ రఫియా చూసుకుంటాడు. బాలిక తల్లిదండ్రులకు 70,000 రూపాయలు ఇస్తాడు. ఏజెంట్‌కు 2.50,000 రూపాయలు ఇస్తాడు. మిగిలింది ఖాజీ తన జేబులో వేసుకుంటాడు. 
 
ఇలా ఇతని వద్దకు వివాహానికి 25 మంది షేక్‌లు వచ్చేవారంటే రఫియా పనితనం ఏ రీతిలో ఉండేదో ఊహించుకోవచ్చు. అంతేకాకుండా ఐదేళ్లలోనే వెయ్యి పెళ్లిళ్లు చేశాడంటే షాకవుతారు. ఇది కేవలం హైదరాబాదు పాతబస్తీకి మాత్రమే పరిమితం కాదని, ముంబైలో కూడా కార్యాలయం ఓపెన్ చేశాడని, అక్కడ తనిఖీలు నిర్వహించిన తరువాత ఇతగాడి అసలు రంగు బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు.. కాపురానికి రాలేదని ఏం చేశాడో వీడియోలో చూడండి

బాలికలపై దేశంలో దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కనిగిరి తరహా ఘటనలు ...

news

మదురై ఆలయంలో ఆచారం.. బాలికలు అర్ధనగ్నంగా గడపాలి..

మదురైలోని ఆలయంలో సంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రస్తుతం వివాదాస్పదమైంది. మదురైలోని ఓ ఆలయంలో ...

news

బెంగళూరులో కనిగిరి తరహా ఘటన: ఇన్‌స్టాగ్రామ్‌లో గర్ల్ ఫ్రెండ్ నగ్నఫోటోలు, ఫోన్ నెంబర్ పెట్టేసిన?

పెళ్లికి నిరాకరించిందని.. స్నేహం ముసుగులో ఓ విద్యార్థినిపై యువకులు అత్యాచార యత్నం చేశారు. ...

news

డేరా బాబా మట్టిపని చేస్తున్నారు.. జీతం రూ.20.. డేరా ఆస్తులు వేలం?

డేరా బాబా గుర్మీత్ సింగ్ అత్యాచార కేసుల్లో జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ...

Widgets Magazine