Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగి అరెస్ట్: హారికను వేధించడంతో?

బుధవారం, 27 డిశెంబరు 2017 (17:07 IST)

Widgets Magazine
yogi

షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవ‌ల షార్ట్‌ఫిల్మ్‌ నటి హారిక.. త‌న‌ను యోగి వేధించాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన నేఫథ్యంలో యోగిని ఓ పోలీసు ఉన్న‌తాధికారి పోలీస్‌స్టేష‌న్‌లోనే కొట్టిన వీడియో వైర‌ల్‌గా మారింది.

అయితే హారిక వాట్సాప్‌లో చాట్ చేసినట్లు యోగి విడుదల చేసిన వీడియో అవాస్తవం అని.. యోగి తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని హారిక ఆరోపించడంతో పోలీసులు యోగిని అరెస్ట్ చేశారు. 
 
అయితే గచ్చిబౌలి పోలిస్‌స్టేషన్‌లో షార్ట్‌ ఫిలిమ్‌ డైరెక్టర్‌ యోగిపై అభియోగాలు మోపి కేసు పెట్టిన హారిక డబుల్‌ గేం ఆడినట్లు యోగి ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను వ్యక్తిగతంగా ఆనందంగా లేనంటూ యోగికి హారిక వాట్సప్‌ మెసేజ్‌ చేసింది. సంతోషంగా లేనప్పుడు విలువలతో ఎందుకు ఉండాలంటూ హారిక చేసిన వాట్సప్‌ మెసేజ్‌లను యోగి మీడియాకు సమర్పించారు. 
 
అడిషనల్‌ డీసీపీ గంగిరెడ్డిపై వేటు పడటానికి కారణమైన వీడియో తీసింది హారికయే అని యోగి తెలిపారు. రొటీన్‌ లైఫ్‌ విసుగొస్తుంది, ఎవ్వరితోనైనా విదేశాలకు వెళ్లి ఎంజాయ్‌ చేయాలనిపిస్తుందని నాకు మెసేజ్‌ చేసిందని యోగి వెల్లడించారు. తమ మధ్య వాట్సాప్‌ చాటింగ్‌ వివరాలు యోగి మీడియాకు వెల్లడించారు. పోలీసు స్టేషన్‌ దృశ్యాలను రికార్డ్‌ చేసింది హారికేనని యోగి అన్నారు. 
 
పోలీస్‌ స్టేషన్‌ దృశ్యాలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిందీ హారికేనని తెలిపారు. కానీ ఆ వీడియో అంతా అసత్యమని హారిక వెల్లడించింది. ఈ కేసులో నిజానిజాలేంటో తేల్చేందుకు పోలీసులు యోగిని అరెస్ట్ చేశారు. విచారణను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బ్లూవేల్ గేమ్‌ ఎఫెక్ట్: బాంబు బూచి.. పోలీసులకు చుక్కలు చూపించిన ఎంసీఎ విద్యార్థి

బ్లూవేల్ ఆన్‌లైన్‌ గేమ్ భూతం బారిన మ‌రో యువ‌కుడు ప‌డ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఎంసీఏ ...

news

#ChappalChorPakistan : ట్విట్టర్‌లో ట్రెండ్

ఇపుడు 'చెప్పల్ చోర్ పాకిస్థాన్' అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ...

news

జస్ట్ ఒక్క ఏడాది ఆగండి... జగనన్న వచ్చేస్తాడు...(వీడియో)

నగరి ఎమ్మెల్యే రోజా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూనే ...

news

చనిపోతూ కూడా సహచరులకు దిశానిర్దేశం చేసిన మేజర్ ప్రఫుల్ (వీడియో వైరల్)

ఇటీవల జమ్మూ-కాశ్మీరులోని కేరి సమీపంలో పాకిస్థాన్ సైన్యం ఎటువంటి హెచ్చరికలు లేకుండా ...

Widgets Magazine