Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇక తాడో.. పేడో తేల్చుకోండి.. ఎంపీలకు చంద్రబాబు సూచన

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (16:51 IST)

Widgets Magazine
chandrababu

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో ఇకపై తాడో.. పేడో తేల్చుకోవాల్సిందిగా పార్టీకి చెందిన ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిన విషయం తెల్సిందే. దీనిపై చంద్రబాబుతో పాటు.. పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
 
ముఖ్యంగా, అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో విభజన హామీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేసే విషయంలో పార్టీ నేతలకు ఎలాంటి పరిమితులు పెట్టలేదు. ఎన్డీయేలో మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ విభజన చట్టంలో ఉన్న హామీలకు కూడా కేంద్రం నిధులు ఇవ్వకపోవడంపై తెలుగుదేశం పార్టీ ఇక తాడో.. పేడో అన్న రీతిలో రాజకీయ అడుగులు వేసేలా ఆదేశించినట్టు తెలుస్తోంది.
 
నిజానికి ఏపీలో కొద్దిరోజులుగా రాజకీయాల్లో కీలకమైన మార్పులు చేసుకుంటున్నాయి. ఏపీ పట్ల కేంద్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. విభజన హామీల అమలు విషయంలో ఎలాంటి ముందడుగు వేయడంలేదు. పైగా పోలవరం వంటి ప్రాజెక్టులకు అంతంతమాత్రం సాయం చేస్తూ లేఖలతో ఆటంకాలు సృష్టిస్తూ వస్తున్న విషయం తెల్సిందే. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు ఇకపై తాడోపేడో తేల్చుకోవాలని పార్టీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. అయితే, ఆదివారం జరిగే పార్టీ కీలక సమావేశంలో దీనిపై ఓ స్పష్టత రానుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కాంగ్రెస్ తలుపులు మూసి చేస్తే.. బీజేపీ తలుపులు తెరిచే ముంచేసింది : టీడీపీ ఎమ్మెల్యే

పార్లమెంట్ తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేస్తే, ...

news

ప్రజలు మాకు తలాక్ చెప్పే రోజులు దగ్గరపడ్డాయ్ : బీజేపీ ఎంపీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బద్ధశత్రువుగా ఉన్న బీజేపీ ఎంపీల్లో సినీ నటుడు శత్రుఘ్నసిన్హా ...

news

జైట్లీ బడ్జెట్‌ సెగలు : బీజేపీ ఎంపీలకు ఓటమి భయం

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజల్లోనే కాకుండా ...

news

ఉ.కొరియాకు పెనుముప్పు పొంచివుంది.. ఆ దేశాలను వదలం: అమెరికా

ఉత్తర కొరియా, అమెరికాల మధ్య త్వరలో యుద్ధం జరిగే అవకాశాలున్నట్లు ప్రపంచ మీడియా ...

Widgets Magazine