గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 24 నవంబరు 2014 (19:16 IST)

వాంటెడ్ : వన్యప్రాణ స్మగ్లరపై ఇంటర్ పోల్ దృష్టి

పర్యావరణానికి హాని కలిగిస్తూ, వన్యప్రాణుల పాలిట యమకింకరులలా తయారైన స్మగ్లర్ల భరతం పట్టేందుకు ఇంటర్ పోల్ సిద్ధమవుతోంది. అడవులపై పడి ఇటు చెట్లను నరుకుతూ, అటు జంతువులను వేటాడుతూ రోజుకో దేశం తిరుగుతూ దర్జాగా బతికేస్తున్నఅంతర్జాతీయ స్మగ్లర్లను పట్టుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది. కెన్యాకు చెందిన కీలక నేరగాడు మహ్మద్ ఆలీతో పాటు 9 మందిని మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించారు. 

 
అడవులు, వన్యప్రాణి సంరక్షణ కోసం ప్రమాదకర పరిస్థితిలో పడిపోయిన అరుదైన జీవరాశులపై అంతర్జాతీయ వ్యాపార సంస్థ(సిఐటిఈఎస్) సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తొలిసారిగా అంతర్జాతీయ వన్యప్రాణి స్మగ్లర్లపై కట్టుదిట్టమైన చర్యలకు ప్రజల సహకారం కోరుతోంది. నేరగాళ్ల ఆటకట్టించడానికి ఇంటర్ పోల్ సహకారం కోరుతోంది.
 
వన్య ప్రాణులపై దాడి సీరియస్ నేరంగా పరిగణిస్తున్నారు. అంతర్జాతీయంగా వన్య ప్రాణుల పాలిట ప్రమాదకరంగా తయారైన స్మగ్లరల్లో 9 మందిని గుర్తించారు. ఈ సంస్థలో 180 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. నేరగాళ్లతో పోరాటానికి దేశాల ప్రభుత్వాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చాయి. 
 
వన్యప్రాణులకు హాని కలిగించడం వలన భద్రత, రాజకీయ అనిశ్చితి, ఆర్థిక, పర్యావరణ వనరులు, సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతింటాయని గుర్తు చేశారు. ఈ నేరగాళ్ళ ఆట కట్టించడానికి ఐసిసిడబ్య్లూసి వంటి సంస్థలు ఆర్థిక, సాంకేతిక సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఏనుగు దంతాలు, పులి చర్మాలు, ఎర్రచందనం, ఎముకల స్మగ్లింగ్ ద్వారా కోట్లు గడిస్తూ ప్రభుత్వాలను గడగడలాడిస్తున్న వారిలో అలీ మొదటివాడు కాగా ఆయన ఆధ్వర్యంలోనే ముఠాలు పని చేస్తుంటాయి. ఇలాంటివారి కోసం ప్రత్యేకంగా ఇన్ఫ్రా టెర్రా అనే ఆపరేషన్‌ను ఏర్పాటు చేశారు.