శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (15:01 IST)

జ్యోతి ప్రజ్వలనకు నిరాకరించిన సీఎం జగన్.. ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఇటీవల అమెరికాలో పర్యటనకు వెళ్లారు. తన కుటుంబ సమేతంగా ఆయన యూఎస్ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగానే ఆయన డల్లాస్‌లో జరిగిన ఓ తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు జగన్‌తో జ్యోతి ప్రజ్వలన చేయించడానిక నిర్వాహుకులు పడిన శ్రమ అంతాఇంతాకాదు. అయినా సరే జగన్ మాత్రం జ్యోతి ప్రజ్వలనకు నిరాకరించారు. 
 
నిజానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హిందూధర్మం, సంప్రదాయం అంటే క్రైస్తవుడైన జగన్మోహన రెడ్డికి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పూజలు, యజ్ఞాలు, యాగాలు చేశారు. మరిప్పుడు డల్లాస్‌లో జరిగిన సభలో జ్యోతిప్రజ్వలన చేయడానికి జగనన్న ఇష్టపడలేదు. 
 
సాధారణంగా ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించే ముందు జ్యోతి వెలిగించడం అనేది వేల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో భాగం. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఒక మంచి పనిని ప్రారంభించేటప్పుడు అది నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తవ్వాలని కోరుకుంటూ యావత్ భారతజాతి జ్యోతిని వెలిగిస్తుంది. అటువంటి దివ్య హైందవ సంప్రదాయాన్ని నిర్వాహకులు బతిమాలుతున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం నిరాకరించడం ఇపుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.