శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2017 (17:06 IST)

మంచు కొండచరియలు విరిగిపడి.. 14జవాన్లు మృతి.. తెలుగు సైనికుడు కూడా?

విపరీతంగా కురుస్తున్న మంచు సైనికులను పొట్టనబెట్టుకుంటోంది. జమ్మూకాశ్మీర్‌లోని గందేర్‌బాల్, బండిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్ పరిధిలో మంచు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన సైనికుల సంఖ్య 14కి చ

విపరీతంగా కురుస్తున్న మంచు సైనికులను పొట్టనబెట్టుకుంటోంది. జమ్మూకాశ్మీర్‌లోని గందేర్‌బాల్, బండిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్ పరిధిలో మంచు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన సైనికుల సంఖ్య 14కి చేరింది. వీరిలో ఓ తెలుగు జవాన్ కూడా మరణించినట్లు సైనికాధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం గ్రామానికి చెందిన మామిడి నాగరాజు(25) భారత సైన్యంలో పనిచేశాడు. 
 
అయితే మంచు కారణంగా అతను ప్రాణాలు కోల్పోయినట్లు సైనికాధికారులు వెల్లడించారు. నాగరాజుకు ఏడాది క్రితమే సమీప బంధువు అనూషతో వివాహం జరిగింది. రాజు మరణంతో కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి.
 
మరోవైపు గురెజ్ సెక్టార్‌లో సైనిక శిబిరంపై మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఆర్మీ సిబ్బంది ఇప్పటివరకు ఆరుగురు జవాన్లను రక్షించారు. ఇంకా మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు సైనికాధికారులు తెలిపారు.