గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (19:07 IST)

బాబు బిజీ బిజీ : ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్!

నవ్యాంధ్రలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆస్టేలియా సుముఖంగా ఉంది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చడానికి ఆ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. 
 
రాష్ట్ర నిర్మాణంలో సహకారం అందించాలని తనను కలిసిన ఆస్టేలియా ప్రతినిధి బృందాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిన సందర్భంలో ఆ దేశ ప్రతినిధులు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపించారు.
 
దీంతో ఐటీ, ఔషధ, తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ మున్ముందు గణనీయమైన ప్రగతి సాధించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలచే అవకాశం ఉంది. వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్ కూడా ప్రపంచంలోని మూడు అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలువబోతోందని అధికారులు అంచనా వేస్తున్నారు.