గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 22 నవంబరు 2016 (14:44 IST)

అరేయ్ ఈ 'నల్ల' రూ.2.35 లక్షలు నీ ఖాతాలో వేసి 'వైట్' చేసివ్వు... కుదరదా, ఐతే నీ ఉద్యోగం ఊడింది పో...

పెద్ద నోట్ల మార్పిడి కోసం నల్లధన కుబేరులు కిందామీదా పడిపోతున్నారు. సిగ్గు లేకుండా తమవద్ద పనిచేస్తున్న చిరుద్యోగుల పొట్టకొట్టేందుకు సైతం వెనుకాడటం లేదు. ప్రభుత్వం హెచ్చరికలను సైతం బేఖాతరు చేసేస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి

పెద్ద నోట్ల మార్పిడి కోసం నల్లధన కుబేరులు కిందామీదా పడిపోతున్నారు. సిగ్గు లేకుండా తమవద్ద పనిచేస్తున్న చిరుద్యోగుల పొట్టకొట్టేందుకు సైతం వెనుకాడటం లేదు. ప్రభుత్వం హెచ్చరికలను సైతం బేఖాతరు చేసేస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. పాలకొల్లులోని ఓ పెట్రోలు బంకులో ఉద్యోగం చేస్తున్న ఓ చిరుద్యోగిని బంకు యజమాని తన వద్ద ఉన్న రూ. 2.35 లక్షలు( అన్నీ రూ.500, రూ.1000 నోట్లు)ను బ్యాంకులో డిపాజిట్ చేసి వైట్ చేయమని చెప్పాడు. 
 
అందుకు యువకుడు నిరాకరించాడు. అలా చేస్తే తనకు వచ్చే రేషన్, ఇతరాలన్నీ రద్దవుతాయనీ, అందువల్ల తానీ పని చేయలేనని తిరస్కరించాడు. ఐతే ఇక నువ్వెందుకూ... నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నా అంటూ ఆ యజమాని అతడిని విధుల నుంచి తొలగించి రోడ్డున పడేశాడు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. కాకపోతే కొన్ని బయటకు వస్తున్నాయి... మరికొన్ని రావడంలేదు. నల్లధనం మార్చుకునేందుకు డిసెంబరు నెలాఖరు వరకూ సమయం ఉండటంతో నల్ల కుబేరులు మార్గాలను అన్వేషిస్తున్నారు.