Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై ప్రభావం

గురువారం, 13 జులై 2017 (10:15 IST)

Widgets Magazine

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమేణా వాయుగుండంగా మారనుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అల్పపీడనం 18 నాటికే వాయుగుండంగా మారి ప్రభావం చూపుతుంది. ఫలితంగా జూలై 16, 17, 18 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవన కాలంలో ఏర్పడుతున్న ఈ వాయుగుండం వల్ల రుతుపవనాలు బలంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 20, 21, 22 తేదీల్లో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాపై ఈ ప్రభావం కనిపిస్తోందని తెలిపింది. ఆ జిల్లాల్లో రానున్న నాలుగు రోజులూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే సూచనలున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు: మహిళా జైలు సూపరింటెండెంట్

మహిళా జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖ మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. తమపై సీనియర్ల ...

news

ఇంటికి బంధువులొచ్చినా అనుమానమే.. కట్టుకున్న భార్యనే పొడిచి పడేశాడు

భర్త తిరుపతికి వెళ్లిన సమయంలో యాదృచ్ఛికంగా భార్య తరపు బంధువులు ఆమె ఇంటికి వచ్చారు. అదే ...

news

కలెక్టర్‌ చేయిని కావాలనే పట్టుకొని... ‘పొరపాటున తగిలి ఉంటే..’అంటారా: జనం ఫైర్

జిల్లా కలెక్టర్‌ నాకు సొదరిలాంటిది. కలెక్టర్‌ అంటే చాలా గౌరవం ఉంది. నేను ఎస్టీ వర్గానికి ...

news

జైల్లో శశికళకు రాజభోగాలు.. ప్రత్యేక వంటగది.. జైళ్ల అధికారికి 2 కోట్ల ముడుపులిస్తే శాంక్షన్

అన్నాడీఎంకే దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు కర్ణాటక జైలులో లభిస్తున్న ప్రత్యేక ...

Widgets Magazine